17 killed in Bihar after Nepal earthquake, death toll may rise

17 killed as fresh earthquake strikes bihar

earth quake, india, delhi, bihar, gawhathi, Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu, north India, Supreme Court, Proceedings Dropping, modi, rajnath, earthquake, nepal, india, north india, china, afghanistan, bihar, AndhraPradesh, PM narendra modi, Rajnath singh,

At least 17 people were killed in India and 39 others were injured as tremors of a powerful earthquake in Nepal caused damage to life and property across northern and eastern India on Tuesday, Ministry of Home Affairs said.

చిగురుటాకులా వణికిన భారతావని.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని

Posted: 05/12/2015 05:37 PM IST
17 killed as fresh earthquake strikes bihar

నేపాల్ తో పాటుగా చైనా, అఫ్ఠనిస్తాన్ సహా భారత్ ను సైతం భూ ప్రకంపనలు వణికించాయి. ఉత్తర భారతం మళ్లీ భయం గుప్పెట్లోకి జారుకుంది. ఢిల్లీ, బీహార్‌, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌లలో మంగళవారం మధ్యాహ్నం సంభవించిన భూ ప్రకంపనలు ధాటికి ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఇళ్లనుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూమి కంపించడం ప్రారంభం కావడంతోనే ఢిల్లీలో పై అంతస్తులలో నివసిస్తున్న ప్రజలు పరుగు పరుగున క్రిందికి వచ్చారు. కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా భయకంపితులై బయటకు పరుగులు తీశారు. బీహార్‌లో భూకంప తీవ్రతకు 12 మంది మృతి చెందినట్లు తెలియవచ్చింది.
 
అఫ్ఘనిస్తాన్‌ కేంద్రంగా మంగళవారం ఈ భూ ప్రకంపనం చోటుచేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. భూమి ఉపరితలం నుంచి 19 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్టు భూప్రకంపన అధ్యయన కేంద్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని చోట్ల భూమి 7.2 గా, మరికొన్నిచోట్ల 6.9 గా రిక్టర్‌ స్కేలుపై నమోదైంది. నేపాల్‌లో భూకంపం సంభవించిన కొద్ది రోజులకే మళ్లీ ఈ సంఘటన జరగడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేపాల్‌ దుర్ఘటన చోటుచేసుకున్నప్పటి నుంచి అప్పుడప్పుడు భారతవని వ్యాప్తంగా భూ ప్రకపంనలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ పరిస్థితులలో ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇవాళ సుమారుగా 60 సెకండ్ల పాటు భూప్రకంపనం సంభవించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఢిల్లీలో భూకంపం సంభవించిన నేపధ్యంలో సుప్రీం కోర్టులో ఈరోజు విచారణలు నిలిపివేశారు. అటు ఇటీవల సంభవించిన భూకంపం ధాటికి సుమారుగా 60 మందిని పొగోట్టుకున్న బీహార్ ఇవాళ మరోమారు పదిహేడు మంది ప్రాణాలను కొల్పయింది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి తీవ్రంగా ప్రకంపించిందని, అపార నష్టం సూచనలు ఉన్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది.

సహాయ చర్యలకు సిద్దంగా వుండాలని అదికారులకు ప్రధాని అదేశం

ఉత్తర భారతదేశాన్ని మరోసారి  వణికించిన భూకంపం పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. భూకంపం వార్తల నేపథ్యంలో ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు.  తక్షణమే  సహాయ, పునరావాస చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున భూమి కంపించిందని, అపార నష్టం సంభవించే అవకాశాలున్నాయని ఢిల్లీ  డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు   అంచనా వేస్తున్నారు. కాగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భూ ప్రకంపనలపై ప్రధాని మోదీకి వివరించారు.

అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి నేపాల్కు ఎలాంటి సహాయాన్నయినా అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని  హామీ ఇచ్చారు. దేశంలోని సంభవించిన భూకంపం ప్రమాదంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను అప్రమత్తం చేశామని కేంద్రమంత్రి చెప్పారు. కఠ్మాండు విమానాశ్రయంలో ప్రయాణీకులు ఆందోళనతో పరుగులు పెట్టారు.  మంగళవారం సంభవించిన   భూకంపంలో ఇప్పటికి నేపాల్లో  30మంది మృత్యువాత పడినట్లు సమాచారం.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : disasters-and-accidents  earthquake  nepal  India  

Other Articles