Nepal earthquake: Buildings collapse in Kathmandu, Tremours in north india

Strong earthquake rocks nepal again

earth quake, india, delhi, bihar, gawhathi, Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu, north India, Supreme Court, Proceedings Dropping, modi, rajnath, earthquake, nepal, india, north india, china, afghanistan, bihar, AndhraPradesh, PM narendra modi, Rajnath singh,

A powerful earthquake has rocked central Nepal, causing extensive damage to buildings and some injuries, eyewitnesses say.

పుండుపై కారం చల్లిన భూప్రళయం.. నేపాల్ లో మళ్లీ భూకంపం.. 30 మంది మృతి

Posted: 05/12/2015 03:11 PM IST
Strong earthquake rocks nepal again

భూతల స్వర్గంలాంటి హిమాలయ పర్వత దేశం నేపాల్లో భూమి తల్లి ప్రళయకార నృత్యాన్ని చేసిన ఘటనలు ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోక ముందే.. మరోమారు విపత్తు ముంచుకోచ్చింది. గత నెల 25న సంభవిచిన భూకంపం ధాటికి నేలమట్టమైన శిధిలాలను ఇంకా పూర్తిగా తొలగించక ముందే.. శావాల దిబ్బెగా మరిని నేపాల్ పై మరోమారు ప్రకృతి కన్నెర్ర చేసింది. ఇవాళ మధ్యాహ్నం వరుసగా ఐదు సార్లు సంభవించిన భూ ప్రకంపనలు అక్కడి వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసేలా చేశాయి.. ఇప్పటికే తమవారిన పోగోట్టుకుని విషాదసంద్రంలో మునిగిన నేపాలీయులను వరుస ప్రకంపనలు భయకంపితుల్ని చేశాయి. ఖట్మాండులో మళ్లీ పలు భవనాలు నేలమట్టం అయ్యాయి.

మంగళవారం మధ్యాహ్నం 12-35 గంటల ప్రాంతంలో తొలి భూకంపం రాగా రిక్టర్‌ స్కేలుపై 7.3గా నమోదు అయింది. రెండో భూకంపం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సంభవించింది. అది రిక్టర్‌ స్కేల్‌పై 6.9గా నమోదు అయింది. మొదటి భూకంప కేంద్రం నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌కి... ఎవరెస్టు పర్వతానికి మధ్య సంభవించగా,  రెండో భూకంప కేంద్రం నేపాల్‌లోని కోడారి ప్రాంతానికి 73 కిలోమీటర్ల ఆగ్నేయంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంప ప్రభావానికి చౌటారా ప్రాంతంలో ఒక భవనం నేలకూలింది.

నేపాల్ లో తొలిసారి వచ్చిన భూకంపం నిమిషం పాటు భూమి కంపించింది. ఎవరెస్టు సమీపంలోని నాంచే బజార్‌ను భూకంపం కేంద్రంగా అధికారులు గుర్తించారు. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదు అయింది. భూ ఉపరితలం నుంచి 19 కిలోమీటర్ల లోపల భూకంపం సంభవించిందని  అధికారులు గుర్తించారు. ఇవాళ సంభవించిన భూకంపం ధాటికి నేపాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 30 మంది చనిపోయినట్టు వార్తలు రాగా, కొంచచరియలు విరిగి పడటంతో మరో 950 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : disasters-and-accidents  earthquake  nepal  INdia  

Other Articles