Indian-origin MP Priti Patel gets cabinet berth in cameron Team

Priti patel gets cabinet rank in david cameron s conservative team

Prime Minister David Cameron, Indian-origin MPs Priti Patel, Britain Employment Minister, Witham in Essex, Esther McVey,, Twitter message,

Prime Minister David Cameron today promoted one of Britain’s most prominent Indian-origin MPs Priti Patel by making her the new Employment Minister, as he continued to give finishing touches to his first all- Conservative Cabinet.

మనమ్మాయే.. దేశం కాని దేశంలో మంత్రి..

Posted: 05/12/2015 05:53 PM IST
Priti patel gets cabinet rank in david cameron s conservative team

బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ నూతన కేబినెట్‌లో భారతీయ సంతతి మహిళ చోటు సంపాదించారు. ఇటీవలి జరిగిన బ్రిటెన్ సార్వత్రిక ఎన్నికలలో మరో పర్యాయం గెలిచిన ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ తన తొలి క్యాబినెట్ లో భారతీయ సంతతికి చెందిన ప్రీతిపాటిల్ కు మంత్రి పదవిని కట్టబెట్టారు. ప్రీతి పాటిల్ ఎక్సెక్స్ లోని విత్తమ్ నియోజకవర్గ నుంచి రెండో పర్యాయం గెలుపోందారు. దీంతో అమెకు తన క్యాబినెట్ లో ఉపాధి కల్పన శాఖ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

కామెరాన్ క్యాబినెట్ లో మంత్రిగా గత పర్యాయం పనిచేసిన ఎస్తర్ మెక్వీ సార్వత్రిక ఎన్నికలలో ఓటమిని చవిచూడటంతో.. అమె స్థానంలో ప్రీతి పాటిల్ కు స్థానం కల్పించారు. తనకు మంత్రి పదవి దక్కడంతో నిజమైన గుర్తింపు దక్కిందని ఇందుకు ప్రధాని కామెరాన్ సహా తన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గతంలో ప్రీతిపాటిల్ నిర్వహించిన కోశాధికారి కార్యదర్శి హోదా నుంచి అమెకు ఈ పదోన్నతి లభించింది. దీంతో కామెరాన్ గతంలో మాదిరిగా కేవలం మగవారికే కాకుండా మహిళలకు కూడా తన క్యాబినెట్ లో సమాన హోదా కల్పించడంలో తీసుకున్న చర్యలో భాగమేనన్న వార్తలు కూడా వినబడుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priti Patil  Britain minister  David Cameron  

Other Articles