Maharastra | DNA | Tests

Maharastra govt decided to conduct dna test to children who begging on roads

Maharastra, DNA, Tests, Begging, Kidnap

Maharastra govt decided to conduct dna test to children who begging on roads. Begging is going as a mafia and kidnapped children used for begging in evry where.

రోడ్ల మీద చంటి బిడ్డలతో అడుక్కుంటే.. డిఎన్ఎ టెస్టులే

Posted: 05/12/2015 05:01 PM IST
Maharastra govt decided to conduct dna test to children who begging on roads

చంకలో చిన్న పిల్లలను పెట్టకొని.. రోడ్ల మీద అడుక్కునే వాళ్లను మనం రోజూ చూస్తూనే ఉంటాం. అయితే మీడియాలో అసలు విషయం ఒకటి తర్వాత వెలుగులోకి వచ్చింది. చాలా మంది కావాలనే చిన్న పిల్లలను అడ్డం పెట్టుకొని ఓ మాఫియా ఏర్పడి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని తెలిసింది. బస్టాప్ లు…రైల్వే స్టేషన్లు…కాస్త జనం ఎక్కువ కనిపించే ప్రతి ప్లేస్ లోను బెగ్గింగ్ వెరీ కామన్. చిన్న పిల్లలతో బిచ్చమెత్తుకునే వారే ఎక్కువగా ఉంటారు. పేదరికంతో రోడ్డున పడతారో లేక బిచ్చమెత్తుకోవడం మంచి బిజినెస్ అనుకుంటారో తెలీదు కాని ఇలాంటి బ్యాచ్ కు ఎండ్ కార్డు వేయని ఫిక్స్ అయ్యింద మహారాష్ట్ర సర్కారు. వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఒళ్లో బిడ్డతో అడుక్కునే ప్రతి మహిళకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలని రూల్స్ పాస్ చేసింది. చంటిపిల్లలతో బిచ్చమెత్తుకునే మహిళలపై ఓ కన్నేసి ఉంచాలని ఫిక్స్ అయ్యింది. పిల్లలతో బిచ్చమెత్తుకునే మహిళలకు వెంటనే డీఎన్ఏ పరీక్షలు చేయించాలని రూల్స్ పాస్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. చిన్నారులను అక్రమంగా రవాణా చేస్తున్నారని రూమర్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర గవర్నమెంట్.  ఒక వేళ నిజంగానే పేదరికంతో…బిచ్చమెత్తుకుంటే వారైతే వారికి  ప్రత్యేకసదుపాయాలు కల్పించి చిన్నారులను బడికి పంపుతామని భరోసా ఇచ్చింది.

ఆర్ధిక పరిస్థితులు సరిగా లేక కొంత మంది ఈ వృత్తిలో ఉంటే…మరికొందరు చిన్నారులను పేదకుటుంబాల నుంచి కొనుక్కొని ఈ పనులు చేస్తారు. వీటిపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కొన్ని ముఠాలు పిల్లలను కొనుక్కొని వారితో డ్రగ్స్ బిజినెస్ చేయించడం.. మరికొందరైతే చిన్నారులకు డ్రగ్స్ ఇచ్చి నిద్రపోయేలా చేసి అడుక్కుంటున్నారని తెలిపారు అధికారులు. ఈ డీఎన్ఏ పధ్ధతి వల్ల చిన్నారుల అక్రమరవాణా ను అరికట్టవచ్చంటున్నారు అధికారులు. డబ్బు సంపాదించుకోవడం కోసం ముఠాలు చేస్తున్న ఈ పధ్ధతిని నివారించాలంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. మరి కనీసం మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల ద్వారానైనా పరిస్థితి మారుతుందో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  DNA  Tests  Begging  Kidnap  

Other Articles