Hyderabad Street fighting case, it seems like pre planned murder: police

Hyderabad street fighting case police takes accused intio custody

Street fighting turns ugly in Hyderabad, kills teen, Mirchowk, Hyderabad, street fighting, boxing bout, old city, Hyderabad, teen dies after continous blows on head and face, Crime, wwf, crime in telangana, crime in hyderabad, sabil, old city boxing video goes viral, nabil father yousuf, nabil parents alleges their son nabil its a cold blooded murder, Dcp satya narayana

nabil parents alleges its a cold blooded murder, and his father yousur questions how can he see his sons murder video

నబిల్ ను పథకం ప్రకారమే హత్యచేసినట్లు అనుమానం

Posted: 05/10/2015 08:21 PM IST
Hyderabad street fighting case police takes accused intio custody

నగరంలోని పాతబస్తీలో సంచలనం సృష్టించిన స్ట్రీట్ ఫైట్ ఘటన పథకం ప్రకారమే జరిగిందనే అనుమానం కలుగుతోందని డీసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. నబిల్ ను కొట్టేందుకు ముందుగానే కుట్ర పన్నినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నబిల్ ను రెచ్చగొట్టి హత్య చేశారనే అనుమానం కలుగుతుందన్నారు. ఈ ఘటన జరిగింది మే 3 న  అయితే.. తమకు ఫిర్యాదు అందింది మాత్రం ఏడవ తేదీన అని తెలిపారు. నబిల్ ను కొట్టి చంపిన వ్యక్తి అబేజ్ అహ్మద్ గా గుర్తించినట్లు పేర్కొన్నారు. అతన్ని కొట్టమని అబేజ్ కు సుల్తాన్ అనే విద్యార్థి సూచించినట్లు తెలిపారు. ఆ స్ట్రీట్ ఫైట్ కు రిఫరీగా ఉన్నది డాలర్ వసీం అని డీసీపీ స్పష్టం చేశారు.
 
ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి ఐదుగుర్ని అరెస్ట్ చేశామని.. దీంతో పాటు కొంతమంది మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కాగా పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. ఈ ఘటనలో అబేజ్, సుల్తాన్, వసీం, ఉమర్, ఇర్ఫాన్ లు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారం రోజుల క్రితమే ఈ ఘటన జరిగినా.. దాన్ని బైక్ యాక్సిడెంట్  గా చిత్రీకరించారు అతని స్నేహితులు.  అయితే తాజాగా బయటకు వచ్చిన వీడియోలో మాత్రం నబిల్ ను కొట్టి చంపినట్లు స్పష్టంగా కనబడింది. దీంతో నబీన్ తండ్రి యూసఫ్ మాట్లాడుతూ..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, నిందితులనకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : street fighting  boxing bout  old city  Hyderabad  yousuf  police  

Other Articles