NRIs donate $2 lakh for projects in Telangana | T-Hub | Vibrant Hyderabad | KTR

Nris donate 2 lakh for projects in telangana

NRIs donate $2 lakh for projects in Telangana, NRIs donate $2 lakh for projects in Telangana, “T-Hub” in gachibowli, W Design Studio, T Hub generates 3,000 jobs by 2017, Hyderabad’s IT and other sectors, Vibrant Hyderabad, ktr, Telangana Minister, nri, dallas, make in telangana

NRIs from Dallas donated $2 lakh to the Telangana Water Grid and Mission Kakatiya schemes. Information technology minister K.T. Rama Rao addressed NRIs in Dallas on Sunday. He also organised a ‘Vibrant Hyderabad’ event to showcase the advantages of investing in Hyderabad’s IT and other sectors.

నారాయణ.. నారాయణ.. అక్కడ తెలంగాణకు కాసుల గలగల

Posted: 05/11/2015 09:50 AM IST
Nris donate 2 lakh for projects in telangana

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పినట్లు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల తనయులు.. నారా లోకేష్, మంత్రి కల్వకుంట తారాక రామారావు లు అమెరికా పర్యటనకు వెళ్లి బిక్షాటన చేస్తున్నారని ఎద్దేవా చేసినా.. తెలుగు రాష్ట్రాలకు మాత్రం మేలు జరుగుతుంది. గ్రామాలను దత్తత తీసుకునేందుకు అమెరికా ఆంధ్ర ప్రవాస భారతీయులు పోటీ పడుతుండగా, ఇటు తెలంగాణకు సంబంధించి.. డల్లాస్ లో జరిగిన విబ్రెంట్ హైదరాబాద్ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్ ఆర్ ఐలు రెండు లక్షల డాలర్లను విరాళంగా అందించారు.

తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ అమెరికాలోని డాల్లస్ లో జరిగిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలకు రెండు లక్షల అమెరికన్ డాలర్లను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన మంత్రి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎన్నారైలు భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు ‘వైబ్రంట్ హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఐటీతో పాటు ఏరోస్పేస్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లో పేరుగాంచిన సంస్థలతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీ-హబ్ ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి, వారి ఆశలు నెరవేర్చనున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. డల్లాస్‌లో 150 ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఐటీసర్వ్ అలయన్స్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సదుపాయాల గురించి ఈ సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారిశ్రామిక పెట్టుబడుల పట్ల తెలంగాణ ప్రభుత్వం సహకార ధోరణితో ముందుకు సాగుతుందని కేటీఆర్ పేర్కోన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  foreign tour  KTR US tour  Mission Kakatiya  K.T. Rama Rao  

Other Articles