'Salman got bail easily because he is Khan': Sadhvi Prachi

Salman khan got bail beacuse he is a muslim

BJP MP Sadhvi Prachi, Vishwa Hindu Parishad leader Sadhvi Prachi, Malegaon blasts.key suspect Sadhvi Pragya Singh Thakur, Salman Khan, Uttar Pradesh, Muslim, Bharatiya Janata Party hit-and-run case, salman to move to bombay high court, Salman Khan to challange sessions court judgement, salman khan, hit and run case, hit and run, salman khan hit and run, hit n run, hit n run case, salman, salman khan cases, salman khan court, salman, actor salman khan, salman khan controversies, entertainment news,

Controversial BJP MP Sadhvi Prachi alleged that Bollywood actor Salman Khan got bail in the 2002 hit-and-run case because he is a Muslim.

ముస్లిం కాబట్టే.. సల్మాన్ కు బెయిల్.. బిజేపీ ఎంపీ వివాదాస్పదవ్యాఖ్యలు

Posted: 05/09/2015 06:16 PM IST
Salman khan got bail beacuse he is a muslim

బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో మహారాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బోంబే హైకోర్టు బెయిలు మంజూరు జారీ చేయడానికి ప్రధాన కారణం అతను మహ్మదీయుడు కావడమేనట. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచి మరోసారి తన  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2002 లో జరిగిన హిట్ రన్ కేసులో సల్మాన్ ఖాన్.. ముస్లిం కాబట్టే బెయిల్ వచ్చిందంటూ  వ్యాఖ్యానించి  సంచలనానికి తెరలేపారు.  అంతేకాదు  వీధి కార్మికులకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి,  సల్మాన్ఖాన్కు వత్తాసు పలికిన బాలీవుడ్ సింగర్ అభిజిత్ సింగ్ను అరెస్టు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.

సల్మాన్ ముస్లిం కాకపోయి వుంటే బెయిల్ లభించేది కాదని సాధ్వి ప్రాచీ అభిప్రాయాపడ్డారు. చట్టం దృష్టిలో అందరూ సమానమని,  బాధితులైన నిరుపేదలకు కూడా న్యాయం జరగాలని ఆమె సూచించారు. అలాగే మాలేగావ్ పేలుళ్ల కేసులో  జైల్లో ఉన్న సాధ్వి ప్రగ్యా సింగ్ ను విడుదల చేయాలని అమె డిమాండ్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ను దోషిగా తేల్చిన ముంబై సెషన్స్ కోర్టు  అయిదేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ.. ఆ తీర్పును సస్పెండ్ చేస్తూ ముంబై హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే సాధ్వీ ప్రాచీ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
కాగా  సాధ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటూ ఇటీవల  వ్యాఖ్యానించి వివాదం రేపారు. పైగా తానేమీ తప్పు మాట్లాడలేదనీ..30,40 మందిని కనమన్నానా అంటూ  సమర్ధించుకున్నారు. పైగా ఎక్కువమంది పిల్లల్ని కన్న హిందూ మహిళలకు అవార్డులు  ఇచ్చి సత్కరించాలని సాద్వీ ప్రాచీ కేంద్ర ప్రభుత్వాన్నికి కూడా సూచనలు చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  Sadhvi Prachi  Hit and run case  Muslim  

Other Articles