Punjab molestation: State education minister Surjit Singh Rakhra calls it ‘God’s wish’

Moga molestation case punjab minister rakes up controversy says death of teen is god s will

Punjab Education Minister, Surjit Singh Rakhra, moga death of teen is ‘God's will’, moga rape, punjab rape, moga molestation, parkash singh badal, badal molestation, badal bus, molestation bus, moga gangrape, molestation in Punjab, Molestation, Moga molestation, Punjab, nation, Crime, "Sukhbir Badal,Moga civil hospital, Girl,14, dies, mother seriously injured, victims thrown, moving bus, India, gang, passengers, conductor, sexually, assaulted, Mayawati, prakash singh badal, moga bus incident, girl thrown off bus,

Punjab Education Minister, Surjit Singh Rakhra, sparked a controversy after he termed the Moga molestation incident as an 'accident' and added that accidents happen by ‘God's will’.

స్వామిభక్తిని చాటుకుంటున్న అమాత్యులు.. బాలిక మరణం దైవనిర్ణయమని వ్యాఖ్య

Posted: 05/02/2015 11:25 AM IST
Moga molestation case punjab minister rakes up controversy says death of teen is god s will

దేశాన్ని కుదిపేసిన 16 ఏళ్ల పంజాబ్ బాలిక హత్యోదంతం మరో నిర్భయ ఘటనగా పెను సంచలనంగా మారుతున్నా.. ఆ రాష్ట్ర మంత్రులు, అధికార అకాలీదళ్ పార్టీ నేతలు మాత్రం ఇంకితం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రతిఫక్షంగా వున్నప్పుడు ప్రతీ చిన్న ఘటనపై స్పందించిన ప్రతిపక్షాలు.. అధికారంలో వున్నప్పుడు మాత్రం సామాజిక సృహను కూడా కోల్పోయి మాట్లాడుతున్నారు. పంజాబ్ లోని మోగాలో  బాలిక, ఆమె తల్లిపై లైంగిక వేదింపులు, కదులుతున్న బస్సునుంచి కిందికి తోసివేసిన ఘటనను ప్రమాదఘటననని,  దైవ సంకల్పం ఆ రాష్ట్ర మంత్రి అభివర్ణించారు.

నిత్యం ప్రమాదాలు జరుతూనే ఉంటాయి. బస్సులు, లారీలు, ఆటోలు.. అంతెందుకు.. విమానాలు కూడా కూలిపోతుంటాయని. ఇదికూడా అలాంటిదే.. ఆ అమ్మాయి మరణం దైవనిర్ణయమని బాధ్యతరహితంగా పంజాబ్ రాష్ట్ర విద్యామంత్రి సుర్జీత్ సింగ్ రఖ్రా వ్యాఖ్యలు చేశారు. ఇలా అని ఆయన తన స్వామి భక్తిని చాటుకుని తన మంత్రి పదవిని పథిలం చేసుకున్నారే తప్ప.. సామాజిక సృహతో ఆలోచించి మాట్లాడలేదు. ఇందుకు కారణం బస్సు సాక్షాత్తు పంజాబ్ ముఖ్యమంత్రి, అకాళీదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ కు కుటీంబికులకు చెందిన ఆర్బిట్ ఏవియేషన్ కు చెందినది కాబట్టి.

ఇక అక్కడే వున్న అధికార పార్టీ అకాలీదళ్ కే చెందిన మరో ఎమ్మెల్యే. ఈ విషయమై స్పందిస్తూ.. 'యాక్సిడెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి. బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారమేదో ఇచ్చేస్తే సరి. కోర్టుకు వెళ్లకుండా ఆ సెటిల్మెంట్ చేసుకుంటే సరిపోద్దిగా' అని పైశాచిక చర్యను సమర్థించే ప్రయత్నం చేశారు. వీళ్లా నేతలు..? దేశ ప్రజల తలరాతలు మార్చే బాగ్యవిధాలు..? వీరికేనా మనం అధికారం కట్టబెట్టింది..? అదే తమ పార్టీ ప్రతిపక్షంలో వుంటే ఇలాంటి ఘటనలపై వారు ఇలాగే స్పందిస్తారా..? తమ బంధువుల అమ్మాయిలకో, సంబంధికులకో ఇలా ఘటనే ఎదురైతే వారు ఇలానే స్పందిస్తారా..? అత్యాచార యత్నాన్ని, లైంగిక వేదింపుల ఘటనలను ప్రమాద ఘటనలుగా మర్చి ప్రజలను తప్పుదోవ పట్టించగలరా..? అది వారి విజ్ఞతకే వదిలేయాలి.
 
బస్సు యజమాని ఎవరో తెలయదని ముక్తాయించిన పోలీసులు కూడా స్వామి భక్తిని చాటుకునేందుకు పోటీపడ్డారు. ఇక ఎఫ్ ఐఆర్ లో బస్సు యజమాని, పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ పేరును చేర్చనలేదు. దీనిపై బాధితురాలి తండ్రి మాట్లాడుతూ తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. సుఖ్బీర్ సింగ్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చగలిగేవారు..  ఈ ప్రపంచంలోనే లేరా?' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.  కాగా లైంగికదాడి ఘటనలో మృతిచెందిన బాలిక దహన సంస్కారాలకు కుటుంబసభ్యులు నిరాకరించారు. రూ.50 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఆర్బిల్ రవాణా సంస్థ అనుమతిని రద్దుచేయాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

అప్పటివరకు దహన సంస్కారాలు నిర్వహించబోమని, మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలోనే ఉంచుతామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆప్, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చాయి. శనివారం పంజాబ్ వ్యాప్తంగా రైల్ రోకో చేపడుతున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.లోక్‌సభలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : moga molestation  Punjab  Surjit Singh Rakhra  Crime  

Other Articles