11-year-old visually challenged boy becomes news anchor of Tamil channel

Blind boy becomes news anchor first in world

Blind boy becomes news anchor: First in world, Eleven-year-old Sriramanujam, Nepal earthquake, Mahinda Rajapaksa trial, Tamil channel Lotus News, Channel Chairman G K S Selvakumar, awareness on eye donation, Uliyampalayam,

Close on the heels of introducing a transgender as a new anchor, city-headquartered Tamil channel Lotus News on Friday presented a visually challenged boy as a news reader, claiming it was the first in the world.

ITEMVIDEOS: అందరిలా నేను లేను.. కొంచెం ఢిఫరెంట్ గా వుండాలనుకున్నాను

Posted: 05/02/2015 12:12 PM IST
Blind boy becomes news anchor first in world

కృషి వుంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు.. తరతరాలకూ చెరగని వెలుగవుతారు.. ఇలవేలుపులవుతారు అన్న సినీ కవులు పదకొండేళ్ల ప్రాయంలోనే ఒంట పట్టించుకున్న ఓ చిన్నారు బాలుడు.. ప్రపంచంలో ఇంత వరకు ఎవరూ సాధించని అరుదైన ఘనతను సాధించాడు. అదే న్యూస్ ప్రెజెంటర్ గా. కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ.. సంకల్పాన్ని మించిన బలం లేదని రుజువు చేస్తూ  పుట్టుకతోనే చూపును కోల్పోయిన శ్రీరామానుజన్ మరో సంచలనానికి నాంది పలికాడు.  ఒక తమిళ న్యూస్ ఛానల్లో న్యూస్ యాంకరింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అందరికంటే భిన్నంగా ఏదైనా సాధించాలని తపన పడిన రామానుజం,  దానికి టీవీ  మీడియాను వారధిగా ఎంచుకున్నాడు. టీవీలో వార్తలు చదవడం ద్వారా తన గురించి పదిమందికి తెలియజేయాలనుకున్నాడు. తనలాంటి వారికి  స్ఫూర్తిగా నిలవాలనుకున్నాడు. తమిళనాడుకు చెందిన లోటస్ న్యూస్ రామానుజం లోని తపనను చూసి అవకాశాన్ని అందించింది. నిన్న రాత్రి రామానుజం సదరు వార్త ఛానెల్ లో న్యూస్ ప్రెజెంట్ చేశాడు. నేపాల్ భూకంపం  తర్వాత పరిణామాలు,  మహింద్రా రాజపక్సే ట్రయల్ తదితర వార్తలతో కూడిన  22  నిమిషాల న్యూస్  బులిటెన్ను బ్రెయిలీ లిపి సహాయంగా శ్రీరామానుజం ప్రెజెంట్ చేశాడు. అది చూసిన  అతని తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. వారి కన్నుల నిండా ఆనందబాష్పాలు వర్షించాయి. ముందు రెండు నిమిషాలు కొంచెం తడబడ్డా,  అలవాటైన తర్వాత బాగా చదివానంటూ  శ్రీరామానుజం ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.  

ప్రస్తుతానికి శ్రీరామానుజానికి  వారానికి ఒక   స్పెషల్ బులిటెన్   ఇస్తున్నామని.. తరువాత రెగ్యులర్గా వార్తలు చదివే అవకాశాన్ని కల్పిస్తామని ఛానల్  ఛైర్మన్ తెలిపారు. సెల్వకుమార్ తెలిపారు. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు  వికలాంగులను ప్రోత్సహించాలన్న సదుద్దేశ్యంతోనే తాము రామానుజానికి అవకాశం కల్పించామన్నారు. ప్రపంచంలో తొలిసారిగా ఒక అంధుడి చేత ప్రైమ్ టైమ్ లో వార్తలను చదివించిన ఘనత తమ ఛానల్  దక్కించుకుందని ఆయన తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : visually impaired  blind  news anchor  news  Lotus News today  Braille  news reader  

Other Articles