Telangana | TRS | KCR | Classes

Telangana cm kcr suggested to party leaders to serve the people

Telangana, TRS, KCR, Classes, Nagarjunasagar

Telangana cm kcr suggested to party leaders to serve the people. IN Nagarjunasagar Telangana cm kcr started special training classes for party leaders.

క్యా బాత్ హై.. కేసీఆర్ సార్ క్లాస్ అదుర్స్

Posted: 05/02/2015 11:45 AM IST
Telangana cm kcr suggested to party leaders to serve the people

నాగార్జన సాగర్ వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి నిన్ననే నాగార్జున సాగర్ కు చేరుకొని ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని తెలంగాణ రాష్ట్రల నుండి వచ్చిన నేతలతో శిక్షణా ప్రాంగణం కిక్కిరిసింది. స్వాగత ఉపన్యాసం చేసిన కేసీఆర్, అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎప్పుడూ నిత్య విద్యార్థిలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగార్జున సాగర్లోని విజయ విహార్లో జరుగుతున్న టీఆర్ఎస్ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. జీవితం చాలా చిన్నదని, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి...ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒకరోజు పాటు శిక్షణా తరగతి ఉంటుందని కేసీఆర్ తెలిపారు.

హైలెట్స్..
*కష్టపడితే కానీ ఏదీ సాధ్యం కాదు
*కొత్త యుగంలో కొత్త పంథాలో ముందుకు వెళ్లాలి
*శక్తి ఉన్నంత వరకు తెలంగాణ కోసం పటుపడదాం
*పదవులు శాశ్వతం కాదు
*ప్రజలకు సేవ చెయ్యడమే గొప్పగా భావించాలి
*మనకు అంతా తెలుసు అనుకోవడం పొరపాటు
*మనకంటే చాలా మంది గొప్పోళ్లున్నారు

నేటి  శిక్షణ తరగతుల అంశాలు...
* ప్రజాస్వామ్యం  పై  డాక్టర్ రవీంద్రశాస్త్రి,  శిక్షణ
*సెంట్రల్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన) జే లక్ష్మి, కార్తిక్  శిక్షణ
*గ్రీన్ కవర్, ఫారెస్ట్, పర్యావరణ సంబంధిత అంశాలు,
*విపత్తుల నిర్వహణ పై తిరుపతయ్య శిక్షణ
*వ్యర్థాల నిర్వహణ - అస్కి డైరెక్టర్ జనరల్ రవికాంత్ శిక్షణ
*గ్రామీణాభివృద్ధి కే తిరుపతయ్య శిక్షణ
*పట్టణాభివృద్ధి - ప్రొఫెసర్ శ్రీనివాసచారి శిక్షణ

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  TRS  KCR  Classes  Nagarjunasagar  

Other Articles