TDP | Channdrababu | Mahanadu | Hyderabad,

TDP, Channdrababu naidu, Mahanadu, Hyderabad,

TDP Polit buearo meeting in hyderabad lakeview guest house. majaor decisions On TDP Mahanadu will discuss inthis meeting.

టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం మరికొద్దిసేపట్లో..

Posted: 05/02/2015 09:41 AM IST

తెలుగుదేశం పార్టీ పొలిటిబ్యూరో సమావేశం నేడు హైదరాబాద్ లొని లేక్ వ్యూ అతిథిగృహంలో జరుగుతుంది. ప్రధానంగా మహానాడు నిర్వహణపై ఇందులో చర్చించవచ్చునని తెలుస్తోంది. మహానాడును నూతన రాజధాని నగరంలో నిర్వహించాలా? లేక ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే జరపాలా? అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు ఉన్నందున హైదరాబాద్ నగరంలోనే మహానాడు నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొంటున్న వివాదాలు, రుణమాఫీ, రాష్ట్రావతరణ వేడుకలు వంటి అంశాలు కూడా చర్చకు రావచ్చునని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చర్చించనున్న అంశాలు..

* తెలుగు దేశం పార్టీ మహానాడు ఎక్కడ నిర్వహించాలి
* తెలుగుదేశం పార్టీ మహానాడులో ఏఏ తీర్మానాలు చెయ్యాలి
*మహానాడు బాధ్యతలు, వివిధ కమిటీల నిర్వహణ
*మంత్రులు, జిల్లా నేతలకు బాధ్యతలు
*ఏపిలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ
*నిరంతర కరెంట్ పై ప్రజల్లోకి ప్రచారం
*తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎన్నికలపై ఎలాంటి వైఖరి అవలంబించాలి
*తెలంగాణలో బలపడాలంటే ఏం చెయ్యాలి
*రాజధాని నిర్మాణంపై పలు సూచనలు, సలహాలు
*ఏపిలొ పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలు
*రాజధాని భూసేకరణలో వస్తున్న ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Channdrababu naidu  Mahanadu  Hyderabad  

Other Articles