TRS | Telangana | KCR | Srinivas Goud

Trs mla srinivas goud said that they will go for appeal on high court orders for parliament seretry posts

TRS, Telangana, KCR, Srinivas Goud, Parliament, Secretry

TRS Mla Srinivas Goud said that they will go for appeal on high court orders for parliament seretry posts. In the past Telangana govt appaointed srinivas goud and other three membres as parliamentary secretries.

హైకోర్ట్ తీర్పుపై అప్పీలుకు వెళతాం: శ్రీనివాస్ గౌడ్

Posted: 05/02/2015 08:48 AM IST
Trs mla srinivas goud said that they will go for appeal on high court orders for parliament seretry posts

పార్లమెంటరీ సెక్రెటరీల నియామకం చెల్లదన్న హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రెటరీ శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పార్లమెంటరీ సెక్రెటరీల నియామకం చట్ట విరుద్ధమని, ఆ నియామకాలు చెల్లవని శుక్రవారం నాడు హైకోర్టు తీర్పు వెలువరించడంపై శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించారు. ఢిల్లీ సహా అనేక రాష్ర్టాల్లో పార్లమెంటరీ సెక్రెటరీల విధానం అమల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను తాము ఇంకా పరిశీలించలేదని, న్యాయ స్థానం తీర్పుపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఉద్యోగుల విభజన విషయంలో కమల్‌నాథన్‌ కమిటీ ఉద్యోగులను అయోమయపరుస్తోందని శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. ఉద్యోగుల విభజనను కమిటీ కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు. పీఆర్సీ బకాయిలపై ఉద్యోగులకు సంతోషకరమైన నిర్ణయం వస్తుందని శ్రీనివాస్‌ గౌడ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే పార్లమెంటరీ సెక్రటరీల నియామకాలపై కోర్టుకు వెళ్లిన గుత్తా సుఖేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు మాత్రం ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని.. ప్రజాస్వామ్యంలో కొన్ని పద్దతులు ఉంటాయని.. వాటిని పాటించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే టిఆర్ఎస్ లో మాత్రం వేరే రకమైన చర్చ సాగుతోంది. పార్లమెంటరీ సెక్రటరీ పోస్టుల కేటాయింపుకు అవకాశం లేకపోతే.. వేరే పోస్టులకు శ్రీనివాస్ గౌడ్ తదితరులను సెలెక్ట్ చెయ్యాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే తుది నిర్ణయం మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దే అని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Telangana  KCR  Srinivas Goud  Parliament  Secretry  

Other Articles