Research And Analysis Wing Reports To PM Office About ISIS Terrorists | Pakistan Border

Isis terrorists pakistan border research and analysis wing

ISIS Terrorists, India pakistan border, ISIS Terrorists India, ISIS Terrorists Afghanistan, Indian RAW, Research And Analysis Wing, Indian Attacks

ISIS Terrorists Pakistan Border Research And Analysis Wing : Recently Research And Analysis Wing Had Sent Report To PM Office About ISIS Terrorists. In That Report Raw Said That.. ISIS Operations Increasing in Pak and Afghan Border Areas Which Indicates Danger to India.

సరిహద్దుల్లో ISIS టెర్రరిస్టులు.. ఇండియాకు ప్రమాదం!

Posted: 05/01/2015 11:51 AM IST
Isis terrorists pakistan border research and analysis wing

ISIS ఉగ్రవాదుల అరాచకం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే! మతతత్వ వ్యామోహంలో పడి చిన్నారులను సైతం అత్యంత దారుణంగా చంపుతున్న ఈ టెర్రరిస్టులు.. తమ ఉగ్రవాద సంస్థకు అన్నిదేశాల్లో వ్యాపించేలా ప్రణాళికలు మరింత వేగంగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లో వీరి కార్యకలాపాలు వున్నాయి. అయితే.. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ ఉగ్రవాదుల కార్యకలాపాలు మరింత విస్తృతం అవుతున్నాయని.. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో వేగవంతం అవుతున్నాయని తెలిసింది. ఈ మేరకు సమాచారాన్ని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) వెల్లడించింది.

పాక్, ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో ISIS ఉగ్రవాదుల కార్యకలాపాలు మరింత ఎక్కువగా పెరుగుతున్నాయని.. అవి భారత భద్రతకు ముప్పుగా పరిణమించే ప్రమాదం వుందని ‘రా’ అభిప్రాయపడింది. ఇరాక్ లో రెండవ అతిపెద్ద నగరంగా పేరున్న మోసుల్ నే అధీనంలోకి తీసుకున్న తర్వాత.. ISIS ఇతర దేశాల్లోనూ నెమ్మదిగా విస్తరిస్తోందని ఆ సంస్థ తెలిపింది. గతనెలలో ఆఫ్ఘన్ లో జరిగిన ఆత్మాహుతి దాడితో వారి జాడలు మరింత ఎక్కువగా పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని ‘రా’ తెలుపుతోంది. ఇదే విషయాన్ని ప్రధాని కార్యాలయానికి నివేదిక ద్వారా తెలిపిన ‘రా’.. ఈ వ్యవహారంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచించింది.

ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే! ఇటువంటి సమయంలో ISIS కార్యకలాపాలు భారత్ లో జొరబడితే.. మరెన్నో మారణహోమాలు జరిగే అవకాశముందని ‘రా’ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే.. ఈ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సిందిగా ప్రధాని కార్యాలయానికి ఆ సంస్థ నివేదిక పంపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS Terrorists  India pakistan border  Indian Attacks  

Other Articles