Dwcrac | ap | chandrababu | loan

Andhra pradesh govt released budget for dwcra group loans

Dwcra, ap, chandrababu, loan, promise, groups,

Andhra pradesh govt released budget for dwcra group loans. Chandrbabu naidu promise to dwcra groups to pay amount which took by dwcra. Now ap govt released 250cr. to dwcra.

అక్కా.. డ్వాక్రా సంఘం పైసలొచ్చినయ్

Posted: 05/01/2015 10:40 AM IST
Andhra pradesh govt released budget for dwcra group loans

తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలకు ఊపుతెచ్చింది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపిలో డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలను మాఫీ చేయిస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. తాజాగా డ్వాక్రా సంఘాల రుణమాఫీకి చర్యలు తీసుకున్నారు చంద్రబాబు.  డ్వాక్రా సంఘాల రుణమాఫీకి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించగా, తొలి త్రైమాసిక నిధులు రూ.250 కోట్లను మంజూరు చేశారు. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మొత్తాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఆంధ్రప్రదేశ్‌ మహిళా సాధికార సంస్థ ఖాతాలో జమ చేయనున్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను అమలు చేసే క్రమంలో చేసిన ఐదు సంతకాల్లో డ్వాక్రా సంఘాల రుణమాఫీ ఒకటి. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు ఒక్కో స్వయం సహాయక బృందం సభ్యురాలికి రూ.10 వేలు ఇవ్వడం ద్వారా ఆ సంఘాల మూలధనం పెంచాలని చంద్రబాబు నిర్ణయించారు.

రాష్ట్రంలో టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చి 10నెలలు గడిచినా డ్వాక్రా సంఘాల రుణమాఫీలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. మరోవైపు డ్వాక్రా సంఘాల్లోనూ అనుమానాలు తలెత్తాయి. సీఎం చంద్రబాబు మాత్రం.. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వచ్చారు. ఇసుక విక్రయాలను డ్వాక్రా సంఘాలకు అప్పగించడం ద్వారా ఆర్థికంగా వాటిని బలోపేతం చేసే దిశగా ఏపీ సర్కార్‌ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఇసుక విక్రయాల ద్వారా రూ.3వేల కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో డ్వాక్రా సంఘాలకు 25 శాతం వాటాగా రూ.750 కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ మొత్తంలో ఖర్చులు పోను నికరంగా రూ.500 కోట్లు మిగులుతుందని, ఆ మొత్తాన్ని డ్వాక్రా సంఘాల మూలధనంకు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మనుగడలో ఉన్న స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తే 80 లక్షల మంది సభ్యులకు సుమారు రూ.8 వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dwcra  ap  chandrababu  loan  promise  groups  

Other Articles