TTD | tirumala tirupati | lord venkateshwara | online | devotes | problems

Tirumala tirupati inline ticket booking getting troubles to devotes

TTD, tirumala tirupati, lord venkateshwara, online, devotes, problems

Tirumala tirupati inline ticket booking getting troubles to devotes. TTD prepared to online booking tickets facilities to devotes. But the site getting many problems and devotes suffering with that.

దేవుడికి ఆన్ లైన్ కష్టాలు.. పాపం గోవిందా.. గోవిందా

Posted: 05/01/2015 11:51 AM IST
Tirumala tirupati inline ticket booking getting troubles to devotes

ఆన్ లైన్ లో దేవుడు కనిపిస్తున్నాడు అని అనగానే ఏ సైట్ లో అని అనుకుంటున్నారా... అసలు విషయం అది కాదు. ఎంతో భక్తితో దేవుడిని దర్శించుకోవడానికి చాలా మంది ముందు జాగ్రత్తగా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుంటారు. అలా ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ కష్టాలు భక్తులకు దేవుడిని చూపిస్తున్నాయి. అవును దేవుడి గురించి ఆన్ లైన్ ను ఆశ్రయించినా కష్టాలు మాత్రం తప్పడం లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్ ద్వారా టికెట్ల బుకింగ్ వ్యవహారం భక్తులకు తలనొప్పిగా మారింది. రూ.300 ప్రత్యేక దర్శనం, ఈ-హుండీ, గదుల కేటాయింపులన్నీ టీటీడీఆన్‌లైన్‌సేవా డాట్ కామ్(ttdonline.com) ద్వారా చేసుకునే అవకాశం ఉంది. వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో పెట్టారు. ఆన్‌లైన్‌లో ఉదయం తొమ్మిదింటికి అందుబాటులోకి వచ్చిన టికెట్లు క్షణాల్లోనే అయిపోతుంటాయి. ఈ టికెట్లు పొందాలంటే ముందు సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే కష్టాలు మొదలవుతాయి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదుచేశాక సెక్యూరిటీ కోడ్ నమోదు కాదు. ఒకవేళ విజయవంతంగా సైట్‌లోకి చేరుకుని పేర్లు నమోదు చేసుకున్నాక సాంకేతిక కారణాల వల్ల లాగిన్ పేజీ మూసుకుపోతే మళ్లీ తెరచి నమోదు చేయడం అసాధ్యం. అప్పటికే ఆ యూజర్ ఐడీ, ఇంటర్నెట్ ఐపీ చిరునామాలను వెబ్‌సైట్ బ్లాక్ చేస్తుంది.

పోని ఇన్ని చేసినా పని జరగకపోతే.. మరో ఐడీతో ప్రయత్నించి సఫలమైతే డబ్బులు చెల్లించడానికి ఆంధ్రాబ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకుల గేట్‌వేలున్నాయి. ఆంధ్రాబ్యాంకు గేట్‌వే అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులను అనుమతిస్తుంది. పంజాబ్ బ్యాంకు కేవలం ఆ బ్యాంకు కార్డులను మాత్రమే అనుమతిస్తుంది. ఇది తెలియక కాసేపు తర్జనభర్జన పడుతున్నారు. కార్డుల వివరాలు పొందుపరిచాక ఎక్కువ సందర్భాల్లో ఖాతా నుంచి డబ్బులు వెళ్లిపోతాయి. అయినా టికెట్లు మంజూరు కావు. పేమెంట్ గేట్‌వే పెండింగ్ అంటూ ఒక్కోసారి రోజంతా చూపిస్తుంది. ఇంతలోనే టికెట్లు అయిపోతాయి. మరికొన్ని సందర్భాల్లో టైం లిమిట్ తరువాత తేదీలకు టికెట్లు తీసుకోవడం సాధ్యం కాదంటూ వెబ్‌సైట్ సమాధానమిస్తుంది. కొన్నిసార్లు టికెట్లు తీసుకున్నట్లు బుకింగ్ ఐడీ వస్తుంది. బుకింగ్ చరిత్రలో మాత్రం ఖాళీ పేజీ దర్శనమిస్తుంది. టికెట్లు రాని సందర్భాల్లో డబ్బుల తిరిగి చెల్లింపునకు జవాబుదారీ వ్యవస్థ లేదు. కార్డు నుంచి డబ్బులు మినహాయించుకున్న తరువాత టిక్కెట్లు జారీ కాకపోతే  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కు ఫిర్యాదును మెయిల్ చేయాలి. మెయిల్ చేశాక ఫిర్యాదుకు సంబంధించిన ప్రత్యుత్తరం లేదా ఫిర్యాదు నమోదైనట్లు ఎలాంటి సంకేతాన్ని ఇవ్వడం లేదు. దీంతో డబ్బులు తిరిగి వస్తాయో రావో తెలియని అయోమయం నెలకొంటోంది. గతేడాది నవంబరు వరకూ దాదాపు 70 శాతం తిరిగి చెల్లింపునిచ్చారు. అప్పటినుంచి ఏప్రిల్ వరకూ వెళ్లిన రీఫండ్ కంప్లెంట్ లను పరిష్కరించలేదు. మొత్తానికి ఆన్ లైన్ లో దేవుడికి, అతని భక్తులకు కష్టాలు తప్పడం లేదు. మరి ఈ కష్టాలకు గోవిందుడు ఎలా పరిష్కారం చూపుతాడో చూడాలి. గోవిందా గోవింద.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD  tirumala tirupati  lord venkateshwara  online  devotes  problems  

Other Articles