Andhrapradesh | Metro | Rapid rail | Capital

Andhra pradesh govt plans to rapid rail in the capital city

Andhrapradesh, Metro, Rapid rail, Capital, Vijayawada, Thullur, Chandrababui, Delhi Metro Rail Corporation

Andhra pradesh govt plans to Rapid rail in the capital city. Andhra prasesh govt review the metro and rapid trains details. Delhi metro rail corporation suggested the ap govt to build the rapid trains on the new capital.

ఏపిలో మెట్రో కాదంట.. ర్యాపిడ్ రైలంట..!

Posted: 05/01/2015 08:51 AM IST
Andhra pradesh govt plans to rapid rail in the capital city

కోల్ కత్త, బెంగళూరు లలో పరుగులు తీసిన మెట్రో రైల్ తొందరోలనే హైదరాబాద్ లో పరుగులు తియ్యనుంది. అయితే ఏపి ప్రభుత్వం మత్రం మెట్రో రైల్ కు బదులుగా ర్యాపిడ్ రైల్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఏపి సర్కార్ ర్యాపిడ్ రైల్ కు సంబందించిన అన్ని వివరాలను సేకరిస్తోందని సమాచారం. విజయవాడ నుంచి గుంటూరు, తెనాలి మీదుగా తిరిగి విజయవాడకు ర్యాపిడ్ రైలు మార్గం నిర్మించవచ్చని దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లే ర్యాపిడ్ రైలు మార్గం తుళ్లూరు, మంగళగిరి మీదుగా ఉండాలని ప్రతిపాదించింది. ఈ నగరాలు, పట్టణాల మధ్య మెట్రో రైలు నిర్మాణాన్ని పరిశీలించాలని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు అధ్యయనం చేసిన డీఎంఆర్‌సీ వీటి మధ్య మెట్రో రైలు నిర్మాణం సాధ్యం కాదని తేల్చింది.

విజయవాడను మినహాయిస్తే... 2011 జనాభా లెక్కల ప్రకారం గుంటూరులో 7,43,364, తెనాలిలో 1,64,649, మంగళగిరిలో 73,416 జనాభా ఉందని, ఇంత తక్కువ జనాభాతో మెట్రో రైలు మనుగడ ఆర్థికంగా సాధ్యం కాదని నివేదికలో సూచించింది. దీనికి బదులుగా వేగంగా ప్రయాణించే ర్యాపిడ్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. మరి ఏపి ప్రభుత్వం అసలే ఆర్థికంగా లోటును ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏపి ప్రభుత్వం మెట్రోరైల్ కు బదులుగా ర్యాపిడ్ రైల్ మార్గానికి సిద్దపడుతున్నట్లు సమాచారం. అయితే మెట్రో రైల్ కన్నా ఖర్చు చాలా తక్కువ కావడం, మెట్రో రైల్ కన్నా వేగం ఎక్కువగా ఉండటం విశేషం. మరి ఏపి ప్రభుత్వం ర్యాపిడ్ రైల్ కు ఓటేస్తుందా లేదంటే మెట్రో రైల్ కే సై అంటుందా చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhrapradesh  Metro  Rapid rail  Capital  Vijayawada  Thullur  Chandrababui  Delhi Metro Rail Corporation  

Other Articles