Facebook | Twitter | Accounts| RahulGandhi

Congress senor leader digvijay singh suggested to rahul gandhi

Congress, facebook, Twitter, Accounts, RahulGandhi, Digvijay singh, Modi,

Congress senor leader digvijay singh suggested to Rahul gandhi. Congress vice president Rahul gandhi didnt open Twitter, Facebook accouts tii now. So Diggi raja suggested that to open facebook, twitter accounts.

రాహుల్ గాంధీ రారా.. అందులోకి రారా..!

Posted: 05/01/2015 08:37 AM IST
Congress senor leader digvijay singh suggested to rahul gandhi

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అని తెలుగులో ఓ సామెత ఉంది. అవకాశం ఉన్నప్పుడే వాడుకోవాలి అని దానర్థం. కానీ పాపం రాహుల్ గాంధీ దాన్ని అస్సలు పాటించలేదు. ప్రధానిగా నరేంద్ర మోదీ పేరు ప్రకటించడానికి ముందే మోదీ నెట్ ద్వారా ప్రజలకు కనెక్ట్ అయ్యారు. కానీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం పాతకాలం మనిషిలానే ఉండిపోయాడు. అసలు ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా జోలికే వెళ్లలేదు. దాంతో ప్రచారంలో మోదీ కన్నా వెనుకబడ్డారు. కానీ అప్పుడు చేసిన తప్పు మళ్లీ చెయ్యొదని సలహా ఇస్తున్నారు దిగ్విజయ్ సింగ్. కనీసం ఇప్పటికైనా మేలేకోవాలని అంటున్నారు ఆయన. మరి ఆయన ఏం అన్నాడంటే..

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోషల్ మీడయా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించే విషయంలో చురుకుగా మారాలని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీ గురించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నదంటూ బీజేపీపై విమర్శలు కురిపించారు. చాలా కాలంగా బీజేపీ రాహుల్ గాంధీపైనా, ఇతర రాజకీయ ప్రత్యర్థులపైనా అవాస్తవాలతో కూడిన ప్రచారాన్ని సాగిస్తున్నదని డిగ్గీ రాజా అన్నారు. రాహుల్ గాంధీకి ఇప్పటి వరకూ ఫేస్ బుక్, ట్విట్టర్ అక్కౌంట్ లు లేవని డిగ్గీ రాజా పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ సోషల్ మీడియాను ఉపయోగిచంకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. యువతలో ఫేస్ బుక్, ట్విట్లర్లకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫేస్ బుక్ ట్విట్టర్ అక్కౌంట్లను ఓపెన్ చేయాలని డిగ్గీరాజా అభిప్రాయపడ్డారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  facebook  Twitter  Accounts  RahulGandhi  Digvijay singh  Modi  

Other Articles