Telangana | CM | KCR | House

Telangana cm kcr said that the govt plans to house for poor people

Telangana, CM, KCR, House, Poor, IDH Colony,

Telangana cm kcr said that the govt plans to house for poor people. In the hyderabad city, cm kcr visit the IDH colony housing society.

ప్రతి పేదవాడికి ఇళ్లే మా లక్ష్యం: కేసీఆర్

Posted: 05/01/2015 08:13 AM IST
Telangana cm kcr said that the govt plans to house for poor people

ప్రతి పేదవాడి సొంతింటి కళను నిజం చెయ్యడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లోని ఐడీహెచ్ కాలనీ ఇళ్ల సముదాయాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గత అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఈ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల తీరును, నాణ్యతను, ఇతరత్రా అంశాలను పరిశీలించేందుకు కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ఐడీహెచ్ కాలనీకి వచ్చారు. పనులన్నింటినీ పరిశీలిస్తూ కాలనీలో ఆయన కలియతిరిగారు. పనుల పురోగతి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇలాంటి ఇళ్లనే హైదరాబాద్‌లోని పేద ప్రజలందరికీ నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఐడీహెచ్ కాలనీలో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, జూన్ 2న తానే ఈ సముదాయానికి ప్రారంభోత్సవం చేస్తానని సీఎం పేర్కొన్నారు. ఈ కాలనీ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తన కోరిక అని, అందుకే వారికోసం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇళ్ల డిజైన్‌పై స్థానిక మహిళల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేసిన మహిళలు.. సామాన్లు పెట్టుకోడానికి సబ్జలు కట్టించాలని కోరారు. వెంటనే స్పందించిన కేసీఆర్.. అన్ని ఇళ్లలో వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM  KCR  House  Poor  IDH Colony  

Other Articles