The increase | wages | homeguard | CM

Telangana govt hike the wages of hiomeguards

The increase , wages homeguard, CM fulfilled promises , police union

Telangana govt hike the wages of hiomeguards. Telangana govt hike the wages of homeguards from three hundred to four hundred per day.

హోంగార్డులకు జీతాలు పెరిగాయోచ్..

Posted: 05/01/2015 08:09 AM IST
Telangana govt hike the wages of hiomeguards

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డులకు శుభవార్త. ఇప్పటి వరకు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతూ కుటుంబ జీవనం సాగిస్తున్న హోంగార్డులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ వాస్తవ రూపం దాల్చింది. వారి రోజువారీ వేతనం రూ.300 నుంచి రూ.400లకు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హోంగార్డుల నెలసరి వేతనం రూ.9000 నుంచి రూ.12 వేలకు చేరుకోనున్నది.

ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి బీ వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. దీంతోపాటు డీజీపీ అనురాగ్‌శర్మ ప్రతిపాదన మేరకు వారికి ఏటా ఇస్తున్న ఒక యూనిఫామ్ అలవెన్స్‌ను రెట్టింపు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. ఇక వారికి చెల్లిస్తున్న పరేడ్ అలవెన్స్‌ను రూ.28 నుంచి రూ.100లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సొంత రాష్ట్రంలో కొలువుదీరినప్పటి నుంచే ప్రభుత్వం.. పోలీసుశాఖ సిబ్బందితో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నది. ఇటీవలే హోంగార్డుల వేతనాలు పెంచుతామని హోంగార్డులకు సీఎం కేసీఆర్ హామీనిచ్చారు. దీనిపై ఆశలు పెట్టుకున్న హోంగార్డులు 15 రోజులుగా తమ జీతభత్యాల పెంపునకు జీవో ఎప్పుడు జారీ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం జీవో జారీచేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : The increase  wages homeguard  CM fulfilled promises  police union  

Other Articles