Rahul Gandhi with farmers in Hirapur village, Amaravati

Rahul gandhi sanvad padyatra meets maharashtra farmers

Rahul Gandhi, Congress Vice President Rahul Gandhi, sanvad padyatra, Rahul meets Maharashtra farmers, rahul 15-km day-long padyatra in Amravati district, Vidarbha region, Maharashtra, Rahul meets families of farmers who committed suicide

Congress Vice President Rahul Gandhi, on Thursday, began a 15-km day-long padyatra in Amravati district in Vidarbha region of Maharashtra, during which he is meeting the families of farmers who committed suicide.

జెట్ స్పీడులో దూసుకెళ్తున్న రాహుల్.. రైతుకుటుంబాలకు పరామర్శ

Posted: 04/30/2015 10:36 PM IST
Rahul gandhi sanvad padyatra meets maharashtra farmers

రాహుల్‌ దూసుకువెళుతున్నారు. బ్రేక్‌ తర్వాత గేర్‌ మార్చేశారు. రైతు సమస్యల ఎజెండాతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. కూల్‌... కూల్‌గా ఉండే రాహుల్‌ ఇప్పుడు కిషాన్‌ ఎక్స్‌ప్రెస్‌గా మారారు. రెండు నెలల బ్రేక్‌ తర్వాత భూమి పుత్రలు, అన్నదాతల సమస్యలను భూజానికెత్తుకున్న ఆయన వారి పక్షాన పోరాడేందుకు రెడీ అయ్యారు. యూపీఏ-1 పాలనలో ఆయనలో కనబడిన ఉత్తేజం.. ఉల్లాసం.. ఆ తరువాత ఆయనలో ఎప్పుడూ కనపించలేదు. ఇక గత సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి అన్ని తానై పోరాడినా.. పార్టీ ఇదివరకెప్పుడూ చవిచూడని పరాజయాన్ని చవిచూసిన తరువాత ఆయన ఆసాంతం నిర్లిప్తంగా మారిపోయారు.

రెండు మాసాల దీర్ఘకాలిక సెలపుపై వెళ్లి వచ్చిన తరువాత రాహుల్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. వచ్చి రాగానే కిసాన్ ర్యాలీలో భై సంస్కరణలకు వ్యతిరేకంగా ర్యాలీని నిర్వహించి విజయవంతంగా ముందుకు కదులుతున్నారు. పంజాబ్ లో మండీలకు సామాన్యుడిలా రైలులో వెళ్లిన రాహుల్ అక్కడి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ఆ తరువాత పార్లమెంటులో కర్షకులు సమస్యలు, రైతు కూలీల సమస్యలపై ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని, టార్గెట్ చేయండంతో పాటు ఎన్డీఏ మేక్ ఇన్ ఇండియాను కూడా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యాలు చేసి.. ఔరా అనిపించారు.

రైతు సమస్యలను పోరాడుతానని నమ్మకాన్ని గ్రామీణ భారతంలో కల్పించి.. నెట్ జనులే కాదు.. భారతావనికి తిండి పెడుతున్న అన్నదాతలు, రైతు కూలీలు ముఖ్యమంటూ సన్ వద్ యాత్రకు పిలుపునిచ్చి దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అదికూడా సాదాసీదాగా, సాధారణ పౌరుడుగా మారారు. రాహుల్ గేర్ మార్చి అనుభవశాలి రాజకీయనేతగా వ్యవహరించడం.. అదే శైలిలో ప్రజలకు దెగ్గరకావడం, అధికార పక్షం సభ్యులకు కోరకరాని కోయ్యగా మారడంతో.. దేశవ్యాప్తంగా సీన్ మారుతోంది.

ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో గల అమరావతి జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతులంతా ఏకం కావాలని రాహుల్‌ పిలుపునిచ్చారు. అమరావతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో 15 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర చేశారు. షాహాపూర్‌ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన కలిసి పరామర్శించారు. రైతు సమస్యలను రాహుల్‌ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం నిన్న రాత్రే నాగ్ పూర్ కు చేరుకున్న రాహుల్ కు ఇవాళ విదర్భ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గున్ జీ, కొన్ ధాలీ, తాలేగావ్ గ్రామాల ప్రజలు రాహుల్ ను చూసేందుకు రోడ్లపై బారులు తీరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  farmers  Amravati  Congress  

Other Articles