Punjab CM Badal condemns Moga molestation-death case, admits the bus belonged to his company

Moga molestation punjab s badals admit bus run by their company

unjab's Badals admit bus run by their company, molestation in Punjab, Molestation, Moga molestation, Punjab, nation, Crime, "Sukhbir Badal,Moga civil hospital, Girl,14, dies, mother seriously injured, victims thrown, moving bus, India, gang, passengers, conductor, sexually, assaulted, Mayawati, prakash singh badal, moga bus incident, girl thrown out of bus, punjab cm prakash singh badal, harsimrat kaur

Condemning the Moga molestation case, Punjab chief Minister Parkash Singh Badal admitted that the bus belonged to a company owned by his family. However, he assured that the accused will be brought to book.

సీఎం అంగీకరించినా.. పోలీసులకు యజమానులెవరో తెలియదట..

Posted: 04/30/2015 06:34 PM IST
Moga molestation punjab s badals admit bus run by their company

పంజాబ్ రాష్ట్రంలోని అమ్మాయిని లైంగికంగా వేధించి.. బస్సులోంచి తోసేసి.. ఆమె మరణానికి కారణమైన ఘటనలో వినియోగించిన కంపెనీ బస్సు తమదేనని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అంగీకరించారు. ఆ బస్సు తమ కుటుంబ కంపెనీకి చెందినదేనన్నారు.  అయినా సరే, బస్సులో ఓ మైనర్ బాలికపై పాశవికంగా అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తాను ఇప్పటి వరకు ఈ కంపెనీకి వెళ్లలేదని చెప్పారు. ఈ బస్సు వ్యవహారం గురించి తాను సుఖ్ బీర్ సింగ్ తో మాట్లాడతానని చెప్పారు. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ వర్గాలు మోగాలో నిరసన ప్రదర్శన చేశాయి. తక్షణం ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.

కాగా, ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సతీమణి, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దారుణాలను ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరముందని అన్నారు. నిందితులకు తప్పక ఖటినంగా శిక్ష్ పడుతుందని చెప్పారు. అయితే బస్సు ఎవరిది..? ఏ సంస్థకు చెందిందన్న విషయం మాత్రం పోలీసులు పరిశీలిస్తారని అన్నారు. కాగా పంజాబ్ పోలీసులు మరో అడుగు ముందుకేసి బస్సు యజమానులు ఎవరో తెలియదని, తమ స్వామి భక్తిని చాటుకున్నారు. బస్సు యజమానులకు కోసం పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక మరోవైపు బస్సులో బాలికపై జరిగింది అత్యాచారం కాదని, హత్యగా పోలీసులు పేర్కోన్నారు.

14 ఏళ్ల వయసున్న బాలికను కొంతమంది ఈవ్ టీజర్లు కదులుతున్న బస్సులోంచి కిందకు తోసేశారు. తీవ్రగాయాలతో ఆమె మరణించగా, ఆమె తల్లి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. మోగా జిల్లాలో తమ గ్రామం నుంచి గురుద్వారాకు వెళ్లేందుకు ఆ బాలిక, ఆమె తల్లి కలిసి ఓ ప్రైవేటు బస్సు ఎక్కారు. అక్కడ కొంతమంది వ్యక్తులు ఆమెను లైంగికంగా వేధించబోగా.. వాళ్లు అడ్డుకున్నారు. దాంతో వాళ్లామెను బస్సులోంచి కిందకు తోసేశారు. బస్సులో ఆ సమయానికి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆమెను వేధించినవాళ్లు బస్సు డ్రైవర్, కండక్టర్ల స్నేహితులని తెలుస్తోంది. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Molestation  Punjab  nation  Crime  

Other Articles