dasari narayana rao speech after cbi filled chargesheet on him in coal scam

Dasari narayana rao coal scam cbi chargesheet updates

dasari narayana rao news, dasari narayana rao coal scam, coal scam updates, coal scam cbi investigation, cbi coal scam investigation, dasari narayana rao controversies, dasari narayana rao scam news

dasari narayana rao coal scam cbi chargesheet updates : Dasari Narayana Rao speaks after cbi filed chargesheet on him in coal scam. He told that he didn't make any illegal issues in that scam.

‘అరె.. నేనేమీ చేయలేదని చెబితే వినిపించుకోరే!’

Posted: 04/30/2015 12:42 PM IST
Dasari narayana rao coal scam cbi chargesheet updates

బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా అవినీతికి పాల్పడ్డారంటూ గతకొన్నాళ్ల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే! అయితే.. ఆ వార్తలను ఆయన ముందునుంచి తోసిపుచ్చుతూ వచ్చారు కానీ.. చివరికీ ఈ స్కాం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా దాఖలు చేసిన చార్జ్ షీటులో ఈయన పేరును కూడా పేర్కొంది. ఈ స్కాంలో దాసరి కూడా అవినీతికి పాల్పడ్డారంటూ ఆ సంస్థ తేల్చి చెప్పేసింది. దీంతో ఖంగుతిన్న దాసరి.. తాను ఏ విధమైన అవినీతికి పాల్పడలేదంటూ మరోసారి మొరపెట్టుకుంటున్నారు.

కేంద్ర బొగ్గుశాఖ సహాయమంత్రిగా వున్నప్పుడు క్షేత్రాల కేటాయింపుల్లో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని దాసరి అన్నారు. ఎవరి నుంచి కూడా తాను సెంటు భూమి కూడా తీసుకోలేదని, ఎవరి నుంచి ఏ విధమైన లాభం పొందలేదని ఆయన చెప్పారు. రాజకీయాల్లో వివాదం సహజమేనని దాసరి పేర్కొన్నారు. ఇదిలావుండగా.. గతనెలలో దాసరికి చెందిన సౌభాగ్య మీడియాలో రూ.2.25 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే! అప్పుడు కూడా ఈ విధంగానే ఆ కేసుతో తనకు సంబంధం లేదని స్పందించారు. మరి ఈ ‘బొగ్గు’ మసి దాసరిని మరెన్ని కష్టాల్లో ముంచుతుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasari narayana rao  coal scam  cbi chargesheet  

Other Articles