Nepal | earth quake | infections | food | suffering,

After earth quake nepal people facing food problem and infections

Nepal, earth quake, infections, food, suffering, death,

After earth quake nepal people facing food problem and infections. Thousands of nepalis died in the earth quake. After that maany of them suffering from the food problem and fearing for infections.

నేపాల్ లో నరకం.. అంటువ్యాధులు, ఆకలితో అలమటిస్తున్న జనం

Posted: 04/30/2015 01:01 PM IST
After earth quake nepal people facing food problem and infections

నేపాల్‌లో భూకంప బాధితులు ఎంతో దుర్భర పరిస్థితిలో గడుపుతున్నారు. ఓ వైపు ఆకలి, మరోవైపు అంటువ్యాధుల ముప్పుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శిథిలాల కింద కూరుకుపోయిన మృతదేహాలు వర్షాలకు కుళ్లిపోయి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. అంతర్జాతీయ సమాజం సాయం చేస్తున్పటికీ బాధితులకు అది అందడం లేదు. అంతేకాకుండా వరుసగా భూకంపాలు వస్తుండటంతో రెస్క్యూ బృంద శిథిలాలను తొలగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.
 
భారీ వర్షాలు సైతం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అనేక మారుమూల గ్రామాల్లో సంబంధాలు తెగిపోవడంతో అధికార యంత్రాంగం చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. గూర్ఖాలోని ఓ గ్రామంలో 2వేల ఇళ్లకు గాను భూకంపం ధాటికి 25 ఇళ్లు మాత్రమే మిగిలాయి. అక్కడ మృతుల సంఖ్య ఎంత అనే దానిపై కూడా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం పది వేల మందికి పైగా చనిపోయి ఉంటారని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అనధికారికంగా 20 నుంచి 25 వేల వరకు చనిపోయి ఉంటారని తెలుస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nepal  earth quake  infections  food  suffering  death  

Other Articles