Baby | Nepal | earth quake | Rescue | Four months | twenty two months,

Baby pulled from nepal earthquake rubble after 22 hours

Baby, Nepal, earth quake, Rescue, Four months, twenty two months,

Incredible images have emerged of the moment a four-month old baby was rescued from the rubble of a building devastated by the Nepal earthquake, 22 hours after the disaster struck.

భూకంపంలో ప్రాణాలతో బయటపడ్డ నాలుగు నెలల చిన్నారి

Posted: 04/30/2015 11:49 AM IST
Baby pulled from nepal earthquake rubble after 22 hours

నేపాల్ లొ సంభవించిన భూకంపం కొన్ని వేల మందిని బలితీసుకుంది. ఎంతో మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. ఎంతో మంది ఇంకా శిథిలాల కింద మగ్గుతున్నారు. చనిపోయిన వారి కోసం ఏడుస్తున్న వారి ఆర్త నాదాలు ఓ వైపు.. బతికున్నా ఆహారం అందక మరి కొందరి అరుపులు ఏడుపులు ఇలా నేపాల్ లో భయంకరమైన పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. అలాంటి వైపరిత్యంలోనూ ఓ అద్బుతం జరిగింది. నాలుగు నెలల ఓ చిన్నారి 22 గంటల తర్వాత బయటకు తీశారు.

నేపాల్ సంభవించిన భూకంపంలో ఒక అద్భుతం జరిగింది. ఆ భూకంప ప్రళయంలో ఒక ఇల్లు పూర్తిగా ద్వంసమైంది. ఆ ఇంట్లోని వారంతా విగతజీవులయ్యారు. వారి శరీరాలను శిధిలాల నుండి బయటకు తీసారు. తర్వాత శిధిలమైన ఆ ఇంటిలోని వస్తువులను పక్కకు తరలించేటప్పుడు, ఆ శిధిలాల లో ఒక చిన్నారి సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ శిధిలాలను జాగ్రత్తగా పక్కకు తొలగించి చూస్తే, ఒక నెలల చిన్నారి ప్రాణాలతో సజీవంగా బ్రతికి ఉంది. వైద్యులు ఆ చిన్నారికి చికిత్స అందిస్తూ, ఆ చిన్నారి వయసు నాలుగు నుండి ఐదు నెలల మధ్య ఉండొచ్చునని, ఆ చిన్నారి సజీవంగా ఉండటం ఒక మిరకిల్ అని వారు పేర్కొన్నారు

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baby  Nepal  earth quake  Rescue  Four months  twenty two months  

Other Articles