talasani srinivasa yadav slams tdp leaders

Telangana tdp leaders are blackmailers alleges talasani

telangana tdp leaders are blackmailers, talasani srinivasa yadav slams tdp leaders, telangana tdp leaders black mail own party chief, talasani srinivasa yadav, sanath nagar, withdraw from politics

talasani srinivasa yadav slams telangana tdp leaders, alleges that, they black mail own party chief

వాళ్లు కలక్షన్ కింగ్ లు.. అధినేతనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

Posted: 04/23/2015 01:09 PM IST
Telangana tdp leaders are blackmailers alleges talasani

తెలంగాణ టీడీపీ నేతలపై తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ టీడీపీలో వున్న నేతలంతా కలెక్షన్ కింగ్ లేనని దుయ్యబట్టారు. సీనియర్ నేతగా చెప్పుకునే ఎర్రబెల్లి దయాకరరావు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దయాకర్ రావు బ్లక్ మెయిలింగ్ ముఠాకు లీడర్ అని అయన విమర్శించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేసి.. పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకుని పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి కోసమే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నారని.. ఇప్పుడు అదే కోవలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వచ్చి చేరారని తలసాని అన్నారు. ఎన్టీఆర్ ను వీడి చంద్రబాబు పంచన చేరినప్పుడు టీడీపీ నేతలు ఏమి ఆశించి చేరారని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాను సనత్నగర్లో ఎమ్మెల్యే పోటీచేసి ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : talasani srinivas yadav  tdp  trs  sanath nagar  

Other Articles