AP | Tax | Telangana | Vehicles | Court

Ap govt palns to tax on telangana vehicles at andhrapradesh

ap, telangana, vehicles, tax, entry tax, transport, court, bus operaters, hyderabad

AP govt palns to tax on telangana vehicles at andhrapradesh. Telangana govt chagres tax on ap vehicles in telangana from last one month.

తెలంగాణ వాహనాలపై ఏపిలో ట్యాక్స్? ఏపి ప్రభుత్వం ఆలోచన

Posted: 04/23/2015 03:48 PM IST
Ap govt palns to tax on telangana vehicles at andhrapradesh

ఏపి నుండి వచ్చే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ టాక్స్ వేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపి రాష్ట్రానికి తీవ్ర ఇబ్బందులు కలిగించింది. తరువాత ఏపి వాహనాల యజమానులు, ఏపి ప్రభుత్వం కూడా  కోర్టుకు వెళ్లడం.. తరువాత ఏపికి వ్యతిరేకంగా తీర్పులు వస్తుండటం జరిగిపోయింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చే తెలంగాణ రవాణా వాహనాలకు పన్ను వసూలు చేసేందుకు ఏపీ రవాణాశాఖ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లుసమాచారం. ఏపీ ప్రైవేటు బస్ ఆపరేటర్లు వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని సవాలుచేస్తూ ప్రైవేటు బస్ ఆపరేటర్లు వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసి, కేసును వేగంగా పూర్తిచేయాలని హైకోర్టును ఆదేశించింది. ఏపీ వాహనాలకు తెలంగాణలో రవాణా పన్ను విధించడంపై పునరాలోచించాలని, ప్రజలపై పన్నుల భారం పడకుండా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఆశించిన ఫలితం రాలేదని.. సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రైవేట్ బస్ ఆపరేటర్ల పిటిషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో.. తెలంగాణ వాహనాలకూ పన్ను వేయడం మినహా మరో అవకాశం లేదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది.

తెలంగాణకు వచ్చే ఏపీ వాహనాల నుంచి ఆ ప్రభుత్వం పన్ను వసూలు చేస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే తెలంగాణ వాహనాలకు ఏపీలో పన్ను వెసులుబాటు ఇవ్వడం వల్ల తెలంగాణ ఆపరేటర్లు లాభపడుతూ.. ఏపీ ఆపరేటర్లు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెండుచోట్లా పన్నుల భారం పడుతున్న నేపథ్యంలో.. బస్సులు నడపలేక ఏపీ ఆపరేటర్లు వందకు పైగా సర్వీసుల్ని నిలిపివేశారు. అదనపు పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఏపీలో తమ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకుని, తెలంగాణలో నమోదు చేసుకునేందుకు కొందరు ఆపరేటర్లు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. తెలంగాణ వాహనాలకు ఏపీలో పన్ను లేకపోవడం వల్ల.. ఏపీలో తెలంగాణ సరకు రవాణా (లారీలు) వాహనాలకు గిరాకీ పెరిగినట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణ నుంచి సిమెంట్, గ్రానైట్, ఇతర ఉత్పత్తుల్ని రాష్ట్రానికి తెచ్చుకోవడానికి.. పన్ను భారం నేపథ్యంలో ఏపీ వాహనాలకు బదులు, తెలంగాణ రవాణా వాహనాలను బుక్ చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇలా రాష్ట్రానికి చెందిన సరకు రవాణా యజమానులు, బస్ ఆపరేటర్లకు జరుగుతున్న నష్టానికి అడ్డుకట్ట వేసేందుకు.. ఏపీకి వచ్చే తెలంగాణ వాహనాలకూ పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. మరి ఏపి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  telangana  vehicles  tax  entry tax  transport  court  bus operaters  hyderabad  

Other Articles