i am happy says manchu lakshmi | Rajendra prasad | Jayasudha | Manchu lakshmi

Jayasudha defeat made me panic than happy over rajendra prasad victory

Manchu Lakshmi on Rajendra prasad victory, Manchu Lakshmi on Jayasudha defeat, Manchu Lakshmi on MAA elections, Rajendra prasad, Jayasudha, MAA elections, Manchu Lakshmi, tollywood actress,

jayasudha defeat made me panic than happy over Rajendra Prasad victory says actress manchu lakshmi

మా ‘రాజు’ గెలుపుకన్నా.. సుధ అపజయం బాధ కలిగించింది

Posted: 04/18/2015 03:23 PM IST
Jayasudha defeat made me panic than happy over rajendra prasad victory

మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలలో నటకిరీటీ రాజేంద్రప్రసాద్ గెలుపు కన్నా సహజ నటి జయసుధ ఓటమి తనకు బాధ కలిగించిందని ప్రముఖ నటి మంచు లక్ష్మీ అన్నారు. మా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా మహిళ పోటీ చేస్తుందన్న కారణంగా ఆమెకు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. మా ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని మంచు లక్ష్మీ సంతోషం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో తాను పేద కళాకారుల అభ్యన్నతికి, సంక్షేమానికి పాటు పడతానని చెప్పారు.

సినీ కార్మికుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మంచు లక్ష్మీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పేద కళాకారులకు పెన్షన్ కల్పించాలన్న ఉద్దేశ్యం మంచిదని, దానిని కొనసాగిస్తమాన్న రాజేంద్రప్రసాద్ కు తమ మద్దతు కూడా వుంటుందని చెప్పారు. మార్చి 29న జరిగిన  మా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..  నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో జయసుధపై రాజేంద్ర ప్రసాద్ 85 ఓట్లతో మోజరిటీతో ఘన విజయం సాధించగా... మా ఉపాధ్యక్షులుగా ప్రముఖ నటుడు శివకృష్ణ, మంచు లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  tollywood actress  MAA election  Rajendra prasad  Jayasudha  

Other Articles