Rahulgandhi | Change | Congress | BJP

Bjp leaders identyfi the changes in rahul gandhi

rahul gandhi, congress, hair, bjp, change, notice

Bjp leaders identyfi the changes in rahul gandhi. Bjp leaders silli answers on change in rahul gandhi. They are saying that rahul hair growth.

రాహుల్ గాంధీ మారాడు.. కావాలంటే ప్రూఫ్ కూడా ఉంది

Posted: 04/18/2015 04:09 PM IST
Bjp leaders identyfi the changes in rahul gandhi

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించనున్న సారథి. అయితే సాధారణ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిరాశ నిసృహ కనిపించాయి. అయితే మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కీలకమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో ఉన్నట్టుంది సెలవుపై వెళ్లారు రాహుల్ గాంధీ . దేశం మొత్తం ఆశ్చర్యం రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లాడు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఎవరి దగ్గరా సమాధానాలు లేవు. ఇక క్లారీటీ లేనప్పుడు ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఊహించుకున్నారు. అయితే మొత్తానికి చాలా రోజుల గ్యాప్ తర్వాత రాహుల్ తిరిగి ఢిల్లీకి వచ్చేశాడు. అయితే రాహుల్ అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయని అందరూ అనుకుంటున్నారు. అసలు ఏం మార్పులు వచ్చాయో తెలుసా....

రాహుల్ గాంధీ లాంగ్ టూర్ తర్వాత తిరిగి వచ్చారు. శనివారం రోజు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కొందరు రైతులతో ఆయన సమావేశమయ్యారు. అయితే సమావేశానికి హాజరైన మార్పుల్లో చాలా మార్పులు కనిపించాయట. అయితే ఆ మార్పులను గుర్తించింది ఎవరొ తెలుసా.. బిజెపి నాయకులు. అవును రాహుల్ లొ వచ్చిన మార్పులను గుర్తించింది బిజెపి నాయకులే. మరి ఇంతకీ వారు ఏం గుర్తించారు. అంటే రాహుల్ గాంధీ గతంలో లాగా క్యూట్ గా కాకుండా పెద్ద మనిషి తరహాలో ఓ రకంగా చెప్పాలంటే పాత తరం హీరోలా జట్టు పెంచడట. అదేంటి జట్టు పెంచడం ఏంటీ అని అడగకండి. ఎందుకంటే వారికి మార్పు జుట్టులోనే కనిపించిందట. రోబో సినిమాలో రోబోను ఏదైనా మార్పులు కనిపించాయా అంటే మీ గడ్డం అర అంగుళం పెరిగింది అని చెబుతుంది. ఇక్కడ కూడా అంతే రాహుల్ గాంధీలో ఏం మార్పు వచ్చిందయ్యా అంటే బిజెపి నాయకులు మాత్రం జుట్టు పెరిగింది అని సమాధానమిస్తున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ జట్టు గురించి బిజెపి నాయకులు చెప్పిన తర్వాత చూస్తే నిజంగానే జట్టు పెరిగింది. దాన్ని నమ్మాల్సిందే. కానీ కాంగ్రెస్ అనుకుంటున్న మార్పు మాత్రం ఇది కాదు. మరి రాహుల్ గాంధీలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఆదివారం నాటి ర్యాలీలో తెలిసే అవకాశాలు ఉన్నాయి.

** అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  congress  hair  bjp  change  notice  

Other Articles