nalgonda native is first women bus driver in delhi

Telugu native becomes delhi transport corporaton service first woman driver

telugu native becomes DTC first woman driver, nalgonda native is first women bus driver in delhi, delhi transport corporaton service, vankadarath saritha, delhi first women driver saritha, Telangana, DTC's first woman driver, Saritha,

A native of nalgonda in Telangana state, vankadarath saritha, is reported to have became the first women to become a Delhi Transport Coporations bus driver.

దేశ రాజధానిలో ప్రగతి చక్రం పట్టిన తొలి తెలుగు వనిత

Posted: 04/18/2015 03:01 PM IST
Telugu native becomes delhi transport corporaton service first woman driver

ఆకాశంలో సగం అంటూ దూసుకుపోతున్న మహిళా లోకం.. భవిష్యత్తులో సమూల మార్పులకు కారణం అవుతారన్న పెద్దల  మాటలు అక్షర సత్యాలుగా మారుతున్నాయి. అనాదిగా వంటగదికే పరిమితమైన మహిళలు.. అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. ఆఫీసుల్లో ఉద్యోగాల నుంచి తాజాగా ఆర్టీసీ బస్సులు నడిపే వరకు అన్నింటా తమ సత్తాను రుజువు చేసుకుంటున్నారు. హైదరాబాద్ సహా పలు పట్టణాలలో అడవారి కోసం ప్రత్యేకంగా షీ క్యాబ్ ను నడుపుతున్న మహిళలు.. ఇప్పుడు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)లో డ్రైవర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ బస్సులకు తొలి మహిళా డ్రైవర్ గా ఎంపికైంది మాత్రం తెలుగు వనితే.

దేశ రాజధాని నగరానికి తొలి మహిళా  డ్రైవర్ను అందించిన ఘనత తెలంగాణలోని నల్గోండ జిల్లా దక్కించుకుంది. జిల్లాకు చెందిన 30 ఏళ్ల వంకదరత్ సరిత తొలి మహిళా డ్రైవర్ గా ఎంపికయ్యారు. ఉత్సాహవంతులైన మహిళా డ్రైవర్లు కావాలన్న ప్రభుత్వ పత్రికా ప్రకటనకు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఒక్క సరిత మాత్రమే మెడికల్గా ఫిట్గా ఉన్నారని డీటీసీ మెడికల్ బోర్డు పరీక్షల్లో తేలింది. దీంతో 28 రోజుల శిక్షణ తరువాత, తొలి మహిళా డ్రైవర్గా సరోజినినగర్ డిపో లో ఆమె నియమించారు.

నల్గొండ జిల్లాకు చెందిన పేదరైతు కుటుంబంలో  పుట్టిన సరితను మగపిల్లలు లేకపోవడంతో తండ్రి  ఆమెను అబ్బాయి లాగా పెంచారు..... తన హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్ స్టయిల్ అంతా   నాన్న ఛాయిస్సే అంటున్న సరిత   మహిళలు సాధించలేనిది ఏదీ లేదని  చెప్పాలన్నదే తన ఉద్దేశ్యమని చాలా ఆత్మ విశ్వాసంతో చెబుతున్నారు. ఇక్కడ బస్సు నడపటం కత్తిమీద సామే అయినప్పటికీ నల్లొండలో ఆటోను, హైదరాబాద్లో కాలేజీ మినీ బస్సు నడిపిన అనుభవం బాగా ఉపయోగపడుతోందంటున్నారు. డ్రైవింగ్లో  సరితకు శిక్షణ ఇచ్చిన పర్వేష్ శర్మ.. ఆమె డ్రైవింగ్ స్కిల్స్ చూసి చాలా అద్భుతంగా వున్నాయంటున్నారు. భవిష్యత్తుల్లో చాలా మంచి  డ్రైవర్ అవుతుందంటూ కితాబులిచ్చారు. తమ నిర్ణయం మరింత మంది మహిళలను డ్రైవింగ్ వృత్తిలోకి రావడానికి ఉత్సాహపరుస్తుందని భావిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  DTC's first woman driver  Saritha  

Other Articles