Salman Khan hit and run case, Defence Gives Reasons For Case Being In Salman Khan’s Support

Salman khan hit and run case tyre burst caused suv to veer off road says lawyer

Bollywood superstar Salman Khan, salman khan in Hit and Run case, salman Khan deposed in mumbai sessions court, salman Khan accused in hit-and-run case, salman khan on hit-and-run case, salman khan tells court he wasn't drunk, salman khan tells court he wasn't driving car, salman khan hit-and-run case, Salman Khan, Hit And Run Case, Court, Statement

Bollywood star Salman Khan's lawyer today rejected the prosecution's claim in the 2002 hit-and-run case that the actor was drunk at the time, saying that the blood sample sent for chemical analysis was not his.

హిట్ అండ్ రన్ కేసు.. సల్మాన్ ఖాన్ కు సానుకూలంగా తీర్పు..?

Posted: 04/17/2015 09:01 PM IST
Salman khan hit and run case tyre burst caused suv to veer off road says lawyer

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు మరో మలుపు తిరగనుంది. సర్వోన్నత న్యాయస్థానం అదేశం మేరకు మరోమారు సల్మాన్ ఖాన్ సహా అతని తరపున కేసులో ప్రత్యక్షంగా ప్రమేయమున్న వారందరి వాంగ్మూళాలను వింటోన్న న్యాయస్థానం.. ఇవాళ సల్మాన్ ఖాన్ న్యాయవాది శ్రీకాంత్ శివాదే వాదనలను కూడా వినింది. ఈ సందర్భంగా ఆయన ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది వాదనలను తోసిపుచ్చారు. కారు ప్రమాదానికి సల్మాన్ ఖాన్ తాగి వాహనాన్ని నడపడమే కారణమన్న ప్రాసిక్యూషన్ వాదలలతో ఆయన ఏకీభవించలేదు.

ప్రమాదం జరిగిన రోజున రోజుమాదిరిగానే ఆ రోజు కూడా ఇంటికి వస్తున్న సల్మాన్ ఖాన్ లాండ్ క్రూసెర్ కారు హిల్ రోడ్డు నుంచి వస్తున్న క్రమంలో సరిగ్గా ప్రమాదం జరిగిన స్థలికి వచ్చేసరికి టైర్ బస్ట్ కావడంతో.. అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి ఎక్కిందని, ఈ నేపథ్యంలో అక్కడ పేవ్ మెంట్ పై పడుకున్న ఒకరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. అయితే ప్రాసిక్యూషన్ తరుపు న్యాయవాదులు ఇందుకు బిన్నంగా ఒక్క సాక్ష్యాన్ని కూడా ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదని చెప్పారు. దీనికి తోడు సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్ అశోక్ సింగ్.. తానే ఈ కారు నడిపానని, ప్రమాద సమయంలోనూ కారును తానే తోలుతున్నానని కోర్టుకు తెలిపాడని చెప్పారు. అంతేకాకుండా అర్టీఓ అధికారి కేస్కర్ కూడా సల్మాన్ కారును పరీక్షించి ఒక వైపు టైరులో గాలి తక్కువగా వుందని కూడా కొర్టుకు తెలిపాడని.. సల్మాన్ న్యాయవాది అన్నారు

అయితే ఈ కేసులో ప్రధాన సాక్షిగా వున్న ఆర్టీఓ అధికారి ఆర్ఎస్ కేస్కర్ పచ్చి అబద్దాల కోరని, ఆయన కోర్టుకు చెప్పిన విషయాలనే వాహనాలను పరీక్షించన తేది సహా సమయాన్ని కూడా మార్చారని కేస్కర్ అన్నారు. అయితే ఇరుపక్షాల వాదనలనలు విన్న న్యాయస్థానం సల్మాన్ ఖాన్ కు సానుకూలంగానే తీర్పును వెలువరించనుందని అశాభావం వ్యక్తం చేశారు. అయితే హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా కోర్టు తీర్పును వెలువరించిన పక్షంలో ఆయనకు పదేళ్ల కాలం పాటు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Hit And Run Case  Court  Statement  

Other Articles