MAA Elections counting starts at 10 am tomorrow

Finally maa elections result on friday

MAA Elections 2015 Results, MAA Elections Live Updates - Inexplores: maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja, actress Hema, maa president elections, maa, movie arts association, shivaji raja, hema

MAA Elections counting starts at 10 am tomarrow in jubliee hills film chamber

రేపు ఉదయం 10 గంటలకు ‘మా’ ఎన్నికల లెక్కింపు..!

Posted: 04/16/2015 09:37 PM IST
Finally maa elections result on friday

తెలుగు సినీ కళామా తల్లి కుటుంబంలో కలహాలకు తెరతీసిన మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు రెండు వారాల తరువాత శుక్రవారం ఉదయం లెక్కించనున్నారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా పెద్ద స్థాయిలో ప్రచారానికి వేదికగా నిలిచిన ఈ ఎన్నికలలో విజయంపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ తో పాటు జయసుధ ప్యానెల్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఫలితాల వెల్లడిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సివిల్ కోర్టు చెప్పడంతో శుక్రవారం ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

జూబ్లిహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్లో ఉదయం పదిగంటలకు ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభం కానుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి అత్యంత వివాదాస్పదంగా మా ఎన్నికలు జరిగడంతో ఎవరి ప్యానెల్ గెలుపోందుతుందన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'మా' అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీపడుతునన్న విషయం తెలిసిందే. మొత్తం 702 మంది సభ్యుల్లో 394 మంది మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే, ఎన్నికలను నిలిపివేయాలని నిర్మాత ఓ కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కోర్టు కొట్టేసింది. దాంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించడంతో, కౌంటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad  jayasudha  movie arts association elections  high court  

Other Articles