RBI Governor Raghuram Rajan receives threat email, Cyber Crime Investigation Cell launches probe

Rbi governor raghuram rajan gets threatening email sources

RBI Governor Raghuram Rajan receives threat email, Rajan gets threat mail from 'ISIS', ID isis583847@gmail.com, .Cyber Crime Investigation Cell launches probe, Reserve Bank of India, RBI Governor Raghuram Rajan, Raghuram Rajan recieves threat email, Mumbai Police, Raghuram Rajan personal Gmail id, Crime Branch, Cyber Crime Investigation Cell launched probe into the matter,

Raghuram RajanReserve Bank of India governor Raghuram Rajan has received a threat mail on his personal email id.

ఆ గవర్నర్ హతమార్చేందుకు ఇస్లామిక్ స్టేట్ సుపారీ..?

Posted: 04/16/2015 01:04 PM IST
Rbi governor raghuram rajan gets threatening email sources

భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ను హతమార్చేందుకు సుపారీ ఇచ్చారా..? ఇచ్చింది మరెవరో కాదు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులా..? ఇంతకీ ఇందులో నిజమెంత..? ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల బెదిరింపు ఈ మెయిల్ నేపథ్యంలో అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కు చెందిన వ్యక్తిగత ఈ మెయిల్ కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. మేము నిన్ను హతమార్చేందుకు కొందరికి డబ్బులను ఇచ్చాం. నీవు అంతకన్నా అధిక సంఖ్యలో మాకు డబ్బులు చెల్లిస్తే.. నిన్న హతమార్చే విషయంపై పునారాలోచన చేస్తాం. అని ఈ మెయిల్ లొ పోందుపర్చి వుంది. ఈ నెల ఆరంభంలోనే వచ్చిన ఈ మెయిల్ పై ఆర్బీఐ అధికార వర్గాలు ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించాయి.

జీ మెయిల్ కు చెందిన ఐఎస్ఐఎస్ 583847@జీమెయిల్ డాట్ కామ్ అడ్రెస్ నుంచి ఈ బెదిరింపు ఈ మెయిల్ వచ్చిందని.. అడ్రస్ లోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఈ మెయిల్ అడ్రస్ గా బావిస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులు.. ఈ కేసును చేధించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. కాగా ఈ కేసును చేధనలో గవర్నర్ కు వచ్చిన ఈమెయిల్ అడ్రస్ విదేశాల నుంచి వచ్చిందని, అంతేకాకుండా అస్ట్రేలియా, ఇటలీ, కెనడా, యూఎస్, నైజీరియా, పోలాండ్, బెల్జియం, జర్మనీ, హాంగ్ కాంగ్, ఉక్రెయిన్ దేశాలకు అసెస్ చేసినట్లుగా వుందని అధికారులు తెల్చారు. మరోవైపు బెదిరింపులు రావడంతో రాజన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఈ విషయాన్ని ముంబాయి పోలీస్ కమీషనర్ రాఖేష్ మారియా తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ నుంచి తమకు పిర్యాదు అందిన నేపథ్యంలో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rbi  joint commissioner  crime branch  reserve bank of india  ISIS  

Other Articles