Monkey trick shorts signals, trains hit | vijayawada | warangal | electrical wires

Monkey stops several trains

monkey stops several trains, Monkey trick shorts signals, trains hit, vijayawada, warangal, electrical wires, trains stoppped, monkey stops, electrical line, Vijayawada and Hyderabad, short circuit in the signalling system, Elugur railway station in Sangem mandal.

Several trains running between Vijayawada and Hyderabad were delayed by four hours after monkeys caused a short circuit in the signalling system at the Elugur railway station in Sangem mandal.

మంకీస్ కన్ డు మెనీ ధింగ్స్.. స్టాపింగ్ ట్రైయిన్స్..

Posted: 04/16/2015 02:53 PM IST
Monkey stops several trains

కోతి చేష్టలని ఊరికే అంటారా పెద్దలు.. అంతేకాదు.. ఈ వనరాలు చేసే పనులపై అనేక సామెతలు కూడా పుట్టుకోచ్చాయంటే అతిశయోక్తి కాదు సుమా. తా చెద్ద కోతి వనమంతా చెరచినట్లని ఊరికే అన్నారా.. వనాన్నే చెరచిన వానరాలు వున్నయని, అంత పెద్ద పెట్టున వాటి అల్లరి చేష్టలు వుంటాయనే కదా.  ఇక్కడ కూడా అలాంటి ఓ కోతి అల్లరి చేసింది. అయితే ఇక్కడ చెరిచింది వనాన్ని మాత్రం కాదు. ఏకంగా పలు రైళ్ల రాకపోకలను అపేసింది వానరం. నిత్యం బిజీగా వుండే విజయవాడ- వరంగల్ మార్గంలో పలు రైళ్లు నిలిపేసింది. కోతికి రైళ్ల రాకపోకలకు సంబంధం మేంటని అడుగుతున్నారు కదూ. అక్కడికే వస్తున్నాం.

వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు స్టేషన్లో ఓ గూడ్స్ రైలును క్రాసింగ్ కోసం ఆపారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో గూడ్స్ వ్యాగన్ మీదకు ఎక్కిన కోతి అక్కడి నుంచి ఎగురుతూ విద్యుత్ కాంటాక్ట్ వైరును పట్టుకుంది. దాంతో హైటెన్షన్ విద్యుత్ ప్రసారం జరిగి మంటలు చెలరేగాయి. విద్యుత్ తీగ కూడా తెగిపోయింది. దాంతో రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులంతా అల్లాడిపోయారు. దాదాపు మూడు గంటల పాటు రైళ్లనీ ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. అయితే.. ఇంత అల్లరి చేసి, విద్యుత్ తీగను తెంపేసినా కోతికి మాత్రం ఏమీ కాలేదు. తీగ తెగగానే దాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోయింది. ఇది గ్రహించిన అధికారులు వెంటనే మరమ్మతులు చేయించి రైళ్ల రాకపోకలను మళ్లీ క్రమబద్దీకరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trains stoppped  monkey stops  electrical line  

Other Articles