GHMC | Elections | Telanagan | Highcourt

High court question to the telangana govt for ghmc elections

Highcourt, Telanagan, GHMC, elections, order, TRS

High court question to the telangana govt for GHMC elections. The high court fire on telangana govt for delying GHMC elections from last one year.

మీరు నిర్వహిస్తారా లేదా మమ్మల్నే నిర్వహించమంటారా..? హైకోర్టు ప్రశ్న

Posted: 04/16/2015 01:06 PM IST
High court question to the telangana govt for ghmc elections

రిజర్వేషన్లు ఖరారు కాలేదు.. మరోసారి డివిజన్ల విభజన జరగలేదు.. ఇంకోసారి ప్రభుత్వం ఎన్నికలకు సిద్దంగా లేదు ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిస కారణాలు. అయితే ఎన్నికల వాయిదాపై ఆగ్రహించిన హైకోర్టు ఎన్నికలు మీరు నిర్వహిస్తారా, లేదా మమ్మల్ని జోక్యం చేసుకొమ్మంటారా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ మీరు నిర్వహించకపోతే.. తామే కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తామని తెలిపింది. దాంతో ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఆరు నెలల గడువు కోరారు. కానీ అంత గడువు అవసరమా లేదా అన్న విషయాన్ని సోమవారం తేలుస్తామని కోర్టు తెలిపింది.

తెలంగాణ రాజధానిగా ఎంతో ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ పై పట్టులే్కపోవడంతో టిఆర్ఎస్ పార్టీ గత కొంత కాలంగా ఎన్నికలకు వెనుకడుగు వేస్తోంది. ఎన్నికలను వాయిదా పడుతున్న సమయంలో పార్టీని బలోపేతం చెయ్యడానికి టిఆర్ఎస్ వర్గాలు వ్యూహాన్ని రచిస్తున్నాయి. ఇది అందరికి తెలిసిన నిజం. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికలపై సవాలక్ష కారణాలను సాకుగా చూపుతోంది. అయితే ప్రస్తుతమున్న 150 డివిజన్లను 200కు పెంచుతున్నట్లు జీహెచ్ఎంసీ తరఫున హాజరైన న్యాయవాది తెలిపారు. నవంబర్ వరకు సమయం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే ఇలా గడువు కోరుతున్నారని, ఇది చట్టానికి లోబడి ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ఈ ఎన్నికలను వెంటనే పెట్టకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు. మొత్తానికి హైకోర్టు మాత్రం ఎన్నికలకు పట్టుబడుతోంది. ఎన్నికల నిర్వహణ మీకు చేతగాకపోతే మేమే చేస్తామన్న కోర్టు తీర్పు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో కదలిక తీసుకువస్తుంది. మరి ఎన్నికలు ఎప్పుడు అన్నది మాత్రం తెలియాలంటే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చెయ్యాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Highcourt  Telanagan  GHMC  elections  order  TRS  

Other Articles