Tamilnadu | Captain | VIjaykanth | CM | Thirdfron

Tamilnadu dmdk party leader cine actor vijvaykanth clear that he will be the candidate from thirdfront

Tamilnadu, vijaykant, captain, dmdk, Thirdfront, elections, cm, cadidate

Tamilnadu dmdk party leader, cine actor vijvaykanth clear that he will be the candidate from thirdfront. The dmdk president captain vijaykanth offer to wasson who trying to discover third front in tamilnadu, That The front shoud announce him as tamilnadu cm candidate.

సీటు కావాలి.. నాకు సిఎం సీటే కావాలి.. అప్పుడే వస్తా

Posted: 04/13/2015 12:29 PM IST
Tamilnadu dmdk party leader cine actor vijvaykanth clear that he will be the candidate from thirdfront

అవకాశం దొరికితే అధికారం కోసం ఎవరు మాత్రం ఆశపడరు చెప్పండి. అందులో తమిళనాయకులు మరీ ముందుంటారు. రాజకీయాలకు పుట్టినిల్లు తమిళనాడు.. దేశం మొత్తం ఒకలా సాగితే తమిళనాట మాత్రం రాజకీయాలు మరో రంగులో ఉంటాయి. అందుకే అక్కడ రాజకీయ నాయకుల ఆలోచనలు, తీసుకునే స్టెప్స్ కూడా ఎంతో కీలకంగా ఉంటాయి. దేశరాజకీయాల్లోనూ తమిళ నాయకుల వైఖరి అందరికంటే భిన్నంగా ఉంటుంది. అయితే తాజాగా తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి.

తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేదు. అయితే తాజాగా రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక దిశగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని నిశ్చయించిన తమిళ్ మానిల కాంగ్రెస్, వామపక్షాలు అందులో భాగంగా డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ కూటమిలోకి రావాల్సిందిగా ఆహ్వానించాయి. అయితే, అందుకు ఆయన సుముఖత వ్యక్తంచేసినప్పటికీ... తననే ఆ కూటమి తరపున సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలి అంటూ నిబంధన విధించడమే ఇప్పుడు తమిళనాట చర్చనియాంశమైంది.

తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేల తర్వాత విజయ్‌కాంత్ నేతృత్వం వహిస్తున్న డీఎండీకేకు అంతోఇంతో కాస్త ఎక్కువ ఓటు బ్యాంక్ వుంది. అందువల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీతో జోడీకడితే ఆ పార్టీ ఓట్లు తమ కూటమికే పడతాయనేది టీఎంసీ, వామపక్షాల ఆలోచన. ఇదిలావుంటే మరోవైపు ఈమధ్య కాలంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కున్న డీఎంకే కూడా విజయ్‌కాంత్‌తో స్నేహం చేసి రానున్న ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తోంది. కానీ సీఎం కావాలని కలలు కంటున్న విజయ్‌కాంత్‌కి ఆ పార్టీతో కలిసివెళ్లడం అనేది అంతగా ఇష్టంలేని పనే అవుతుంది. అంతేకాకుండా రాష్ర్టంలో బలమైన థర్డ్ ఫ్రంట్ తీసుకురావాలని ఆయన గత ఎన్నికల సమయంలోనే ప్రయత్నించినప్పటికీ అప్పుడు అది సాధ్యపడలేదు. అటు టీఎంసీ, వామపక్షాలు కూడా ఈసారి ఎట్టిపరిస్థితుల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్ పెట్టితీరాల్సిందేనని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌కాంత్ పెట్టిన కండిషన్‌కి టీఎంసీ, వామపక్షాలు అంగీకరించి ఆయన్ని కూటమిలోకి చేర్చుకుంటాయా అన్నది ప్రశ్న. దీనిపై తొందరలోనే క్లారీటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu  vijaykant  captain  dmdk  Thirdfront  elections  cm  cadidate  

Other Articles