HIghcourt | Encounter | AP | Tamilnadu

Shashachalam encounter case ajudged for tommarrow

sheshachalam, encounter, ap, police, tamilnadu, chandrababu, highcourt,

shashachalam encounter case ajudged for tommarrow. The high court of andhrapradesh ajudge the case of encounter which place at chittur sheshachalam forest.

శేషాచలం ఎన్ కౌంటర్ విచారణ రేపటి్కి వాయిదా.. మలుపులు తిరుగుతున్న కేసు

Posted: 04/13/2015 01:00 PM IST
Shashachalam encounter case ajudged for tommarrow

శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై హైకోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. అయితే ఎన్ కౌంటర్ విషయాలు మీడియాలో రావడంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ మీడియాకు విషయాలు వెల్లడించారు అంటే అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని కూడా కోర్టు వెల్లడించింది.  విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.  తన భర్తను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్  స్పీడ్ పోస్ట్  ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది.   ఈ  ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని  ఏపీ పోలీసులను  హైకోర్టు ఆదేశించింది.  ఆమెను ప్రతివాదిగా చేర్చాలంటూ  ఆదేశించింది. దర్యాపు వివరాలను గోప్యంగా  ఉంచాలని కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎక్కడా ఎవరూ ప్రస్తావించకూడదని తెలిపింది.   కేసు  విచారణలో ఉండగా వివరాలు ఎలా  వెల్లడిస్తారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  అలాగే  ఆమెకు న్యాయ సహాయాన్ని అందించాల్సిందిగా  లీగల్ సర్వీస్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది.  

మరో పక్క జాతీయ మానవ హక్కుల సంఘం ముందు కొందరు తమిళ కూలీలు పోలీసులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు. తమ ముందే తమ వారిని అరెస్టు చేసి తీసుకెళ్లారని, తర్వాత వారిని కాల్చి వేసి ఎన్ కౌంటర్ అని చెబుతున్నారని కూడా వారు కమీషన్ ముందు వెల్లడించారు. మొత్తానికి తమిళనాడుకు చెందిన కూలీలను కావాలనే పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేశారని వస్తున్నయ ఆరోపణలకు మరింత బలం చేకూరేలా జాతీయ మానవ హక్కు సంఘం ముందు వాగ్మూలాలు నమోదయ్యాయి. మరి ఈ ఎన్ కౌంటర్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sheshachalam  encounter  ap  police  tamilnadu  chandrababu  highcourt  

Other Articles