Iraqi Yazidi girls abducted by Islamic State faced torture, rape, forced marriage and were sold

Islamic state militants gangrape yazidi women in public

Islamic State militants gangrape Yazidi women in public, Yazidi women released by IS militants, Yazidi women gang-raped in public by isis, Yazidi women tortured by Isis, Yazidi women, islamic state, Rape, sexual abuse, Physical torture, World, Middle East, Iraqi Yazidi girls forced marriage and sold

Yazidi women released by IS militants this week were gang-raped in public by fighters and tortured by their captors, according to distressing accounts of their ordeals, The Independent reported.

ఐఎస్ఐఎస్ దారుణాలు.. బహిరంగంగా యాజిది మహిళలపై అత్యాచారాలు

Posted: 04/11/2015 02:48 PM IST
Islamic state militants gangrape yazidi women in public

అది ఇరాక్.. అక్కడ ప్రభుత్వానికి.. ఇరాక్ సిరియా దేశాల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు మద్య గత కోన్నేళ్లుగా పోరు సాగుతోంది. ప్రభుత్వంతో పోరులో ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు కీలక చమురు నిక్షేపాలున్న ప్రాంతాలను చేతబట్టుకున్ని.. ప్రపంచ అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థగా కూడా మారింది. ఇంత వరకు బాగానే వున్నా.. మత చందాసవాదం అతిగా వేళ్లూనుకున్న వీరిలో అందరినీ తమ మతంలోకి కలుపుకోవాలని.. ప్రపంచ వ్యాప్తంగా ఇతర మాతాలు వుండకూడదన్న దోరణిలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు.

ఎందుకు ఉగ్రవాద సంస్థకు ఆజ్యం పోశారన్న విషయాన్ని మర్చి.. పరమతస్థులను, ముస్లింలోని మైనార్టీ వర్గాలను టార్గెట్ గా చేసుకుని అకృత్యాలకు పాల్పడుతున్నారు,. ఇరాక్ లో ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులు సలుపుతున్న అఘాయిత్యాలు సభ్యసమాజం తీవ్ర దిగ్భ్రాంతి చెందేలా వున్నాయని సమాచారం. మతం గోప్పదనాన్ని చాటి.. తమ మతంలోకి ఆహ్వనించేవారిని చూసాం కానీ మతం మాటున మారణహోమం సృష్టిస్తున్న వీరి తీరు అత్యంత భయానకం. పరమతస్థులను వీరు అధీనంలోకి తీసుకుని వారిని బానిసలుగా మర్చుకుంటూ మరోమారు రాతి యుగం వైపు అడుగులు వేస్తున్నారు.

ఇటీవల వీరి నుంచి బంధ విముక్తులైన వారు.. వారనుభవించిన నరకాన్ని మీడియాకు తెలిపారు. 14, 15 ఏళ్ల వయస్సుండే పరమత అమ్మాయిలపై అనునిత్యం అత్యాచారాలు జరిపే వారు. బహిరంగంగానే వారిపై జరుగుతున్న అత్యాచారాల ఎదుర్కోన్న అమ్మాయిలు.. ఇదేనా నరకం అనేలా బాధ పడ్డారు. జీవం వున్న బోమ్మల మాదిరిగా తాము వారి అకృత్యాలను సహించాల్సి వచ్చిందని, వారు చిత్రహింసలు చెప్పనలవి కావని అబాగినులు విలపిస్తూ చెప్పారు. కొందరు అమ్మాయిలు తమపై జరుగుతున్న ఘోర కలిని భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని వివరించారు.

గత ఏడాది అగస్టు మాసంలో ఇరాక్ లోని సింజర్ ప్రాంతాన్ని తమ కబంధ హస్తాలలోకి తీసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. ఆక్కడున్న యాజిది మహిళలను, పిల్లలను తమ బంధీలుగా చేసుకుని ఎనమిది నెలల తరువాత కొందరి విడుదల చేశారు. తమపై ఉగ్రవాదులు అత్యాచారాలకు తెగబడటంతో పాటు తమకు నచ్చిన వారికి బహుమానంగా కూడా ఇచ్చేవారని, అక్కడ కూడా తాము మానసికంగా, శారీరకంగా అనేక బాధలు పడాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yazidi women  islamic state  Rape  sexual abuse  Physical torture  World  Middle East  

Other Articles