member of legislative assembly sunnam rajaiah assulted by secratariat security forces

Mla sunnam rajaiah not allowed into telangana secretariat

mla sunnam rajaiah, mla rajaiah not allowed into telangana secretariat, member of legislative assembly sunnam rajaiah, cpim mla sunnam rajaiah,

member of legislative assembly sunnam rajaiah assulted by secratariat security forces

బాబ్బాబు.. నేను ఎమ్మెల్యేను.. నువ్వా.. ఎమ్మెల్యేవా..?

Posted: 04/11/2015 02:43 PM IST
Mla sunnam rajaiah not allowed into telangana secretariat

ఆయన ఎమ్మెల్యే.. అందునా కమ్యూనిస్టు పార్టీకి చెందిన శాసనసభ్యుడు. 2004లో కాంగ్రెస్ తో పోత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 కేవలం స్వల్ప ఓట్ల తేడాతో ఆయన తన ప్రత్యర్థి కుంజా సత్యవతి చేతిలో అపజయం పాలయ్యారు. 2014లో మరోమారు తన సత్తా చాటుకుని ఎమ్మెల్యేగా గెలిచి.. తన ప్రాంత సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారు. అయితే ఆయన రెండు పర్యాయాలు ఎమ్మల్యేగా కొనసాగుతున్నా.. ఆయన నియోజకవర్గ ప్రజలు.. మహా అయితే ఆయన జిల్లావాసుల్లో కొందరు గుర్తు పట్టవచ్చు. అంతే. అంతకు మించి ఆయనను ఎవరు గుర్తు పడతారు.

పొద్దస్తమానం ఎవరు అధికారంలో వున్నా, తమ వారైనా, ప్రత్యర్థులైనా..ప్రభుత్వంపై నోరు పారేసుకుని, పోద్దస్తామనం తిట్ల పురాణం అలపించి.. మీడియాలో అదే పనిగా హైలైట్ అయితే.. వారు హీరోలు.. ప్రజా సమస్యల పరిష్కారానికే అధిక సమయాన్ని కేటాయించి.. నలుగురిలో ఒకరిలా మెలిగే వారిని అసలెవరైనా గుర్తు పెట్టకుంటారా..? ఇక మరో విషయానికి వస్తే.. ప్రభుత్వాన్ని అడిపోసుకునే వారితో పాటు.. వత్తాసు పలికే వారికి పదవులు లేకపోయినా.. ప్రజల్లో పాపులారిటీ మాత్రం అధికంగానే వుంటుంది.

ఇవి కొరవడడంతోనే రెండు పర్యాయాలు ఖమ్మం జిల్లా భద్రాచల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సున్నం రాజయ్యను శాసనసభ్యుడిగా గుర్తించలేకపోయారు సచివాలయ సిబ్బంది. అదీ కాకుండా సాదాసీదాగా అటోలో రావడం చూసి నువ్వా..? ఎమ్మెల్యేవా..? అంటూ ఆయనను సూటిపోటీ మాటలతో ఇబ్బంది పెట్టారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వెళ్లిన సున్నం రాజయ్యకు సచివాలయ సెక్యూరిటీ అడ్డుకోవడంతో పరాభవం ఎదురైంది. చివరికి ఆయన తన ఐడీ కార్డును చూపించినా.. ఆయన ప్రయాణిస్తున్న ఆటోను సచివాలయంలోకి అనుమతించలేదు. ఇక చేసేది లేక రాజయ్య అటో దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. మంచోళ్లకు కష్టాలు తప్పవని పెద్దలు ఊరికే అన్నారా.. ఒక ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి వస్తే.. ఇక సాదాసీగా పౌరులు సచివాలంయంలోకి వెళ్లాలంటే ఎన్ని అగచాట్ల పడాలో..మరి..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunnam Rajaiah  bhadrachalam mla  Telangana secretariat  

Other Articles