Vikaruddin | Police | Encounter

Terrorist vikarudin father filed a case on vikarudin encounter in aleru policestation

vikaruddin, gang, encounter, police, telangana, kcr, asad, owisi, complaint

terrorist vikarudin father filed a case on vikarudin encounter in aleru policestation. On Tuesday telangana police encountered on vikaruddin gang at warangal high way. Vikaruddi and his four friends shot dead.

ఆ ఎన్ కౌంటర్ బూటకం.. ఎస్కార్ట్ పై కేసు పెట్టిన వికార్ తండ్రి

Posted: 04/11/2015 12:57 PM IST
Terrorist vikarudin father filed a case on vikarudin encounter in aleru policestation

వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్పై  ఆలేరు పోలీస్ స్టేషన్లో వికారుద్దీన్ తల్లిదండ్రులు  ఫిర్యాదు చేశారు.  వికారుద్దీన్ తండ్రి హైదర్తో పాటు ఎన్కౌంటర్లో మృతి చెందిన అనీఫ్ సోదరుడు కూడా పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఈ ఎన్ కౌంటర్ బూటకమని,  పోలీసులతో పాటు ఎస్కార్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో డిమాండ్ చేశారు.  అందరు అనుకున్నట్లే వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై కేసు నమోదైంది. ఈ ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ జరిపించాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది ముస్లిం పెద్దలతో కలిసి అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సిఎం కెసిఆర్ ను కలిశారు కూడా.

వరంగల్-నల్లగొండ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ అయిన విషయం తెలిసిందే. డీజేఎస్ వ్యవస్థాపకుడు, సిమి తీవ్రవాది వికారుద్దీన్ తో పాటు అతని అనుచరులు సయ్యద్ అమ్జద్, ఎండీ జకీర్, ఎండీ హనీఫ్, జొహర్‌ఖాన్‌లు హతమయ్యారు.  వరంగల్ జిల్లా సెంట్రల్ జైలునుంచి ఓ కేసు నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vikaruddin  gang  encounter  police  telangana  kcr  asad  owisi  complaint  

Other Articles