Nehru | IB | Spied | Subhaschandrabose

Nehru govt spied on subhas chandra bose s family for 20 years

nehru, subhaschandrabose, netaji, spy, congress, modi, bjp, congressgovt, ib, report,

The Jawaharlal Nehru government had placed the family and relatives of Subhas Chandra Bose on surveillance for two decades, Times Now reported quoting de-classified intelligence reports.

సుభాష్ చంద్రబోస్ పై నెహ్రూ ప్రభుత్వం 'నిఘా'..?

Posted: 04/10/2015 03:38 PM IST
Nehru govt spied on subhas chandra bose s family for 20 years

స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న సుభాష్ చంద్రబోస్ పై అప్పటి నెహ్రూ ప్రభుత్వం నిఘా ఉంచిందా.. ఒక్క సుభాష్ చంద్రబొస్ ఒక్కరిపైనే కాదు అతని కుటుంబ సభ్యులు, బంధువులపైనా నెహ్రూ ప్రభుత్వం నిఘా ఉంచిందని తాజాగా వెల్లడైంది. 1948 నుండి 1968 వరకు అంటే 20 సంవత్సరాల వరకు నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ పై నిఘా ఉంచిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటి కాంగ్రెస్ ఎన్నో కుట్రలకు దిగింది అంటూ ప్రస్తుత బిజెపి నాయకులు కాంగ్రెస్ పై మండిపడుతున్నారు. తాజాగా ఐబి రిపోర్టుల్లో నేతాజీ, నెహ్రూలకు సంబందించిన వివరాలు వివాదాలకు తావిస్తున్నాయి.

బోస్ కుటుంబ సభ్యులపై నిఘా కొనసాగిన 20ఏళ్లలో... మొదటి 16ఏళ్ల పాటు నెహ్రూనే ప్రధానిగా ఉన్నారు. ఐబీ ఫైళ్ల ప్రకారం కోల్ కతాలో బోస్ కు చెందిన రెండు ఇళ్లపై నిఘా ఉన్నట్టు స్పష్టమవుతోంది. వుడ్ బర్న్ పార్క్, ఎల్జిన్ రోడ్ పేరుతో ఉన్న ఈ రెండు ఇళ్లపై నెహ్రూ సర్కార్ ఐబీ ద్వారా నిఘా ఉంచిందని తెలుస్తోంది. ఐబీ అధికారులు.. బోస్ కుటుంబానికి సంబంధించిన నిఘా వివరాలను నేరుగా నెహ్రూకే వివరించేవారని కథనాలు వినిపిస్తున్నాయి.

బోస్ కుటుంబ సభ్యులు రాసిన లెటర్ కాపీలు, వారు దేశంలోనూ, విదేశాల్లోనూ ఎక్కడెక్కడకు వెళ్లేవారో, ఏమేం చేసేవారో కూడా ఐబీ తెలుసుకునేదట. అయితే బోస్ -కుటుంబ సభ్యులపై నెహ్రూ ఎందుకు నివేదిక అడుగుతున్నారో ఐబీ అధికారులకు కూడా తెలియదట. ప్రధానంగా నేతాజీ కుమారులపైన, మేనలళ్లు శిశిర్ కుమార్ బోస్, అమియానాథ్ బోస్ లకు సంబంధించిన విషయాలను ఐబీ ట్రాక్ చేసేదని ఆ ఫైళ్ల ద్వారా తెలుస్తోంది..

బోస్ కుటుంబ సభ్యులపై నిఘా కొనసాగిన 20ఏళ్లలో... మొదటి 16ఏళ్ల పాటు నెహ్రూనే ప్రధానిగా ఉన్నారు. ఐబీ ఫైళ్ల ప్రకారం కోల్ కతాలో బోస్ కు చెందిన రెండు ఇళ్లపై నిఘా ఉన్నట్టు స్పష్టమవుతోంది. వుడ్ బర్న్ పార్క్, ఎల్జిన్ రోడ్ పేరుతో ఉన్న ఈ రెండు ఇళ్లపై నెహ్రూ సర్కార్ ఐబీ ద్వారా నిఘా ఉంచిందని తెలుస్తోంది. ఐబీ అధికారులు.. బోస్ కుటుంబానికి సంబంధించిన నిఘా వివరాలను నేరుగా నెహ్రూకే వివరించేవారని కథనాలు వినిపిస్తున్నాయి.

బోస్ కుటుంబ సభ్యులు రాసిన లెటర్ కాపీలు, వారు దేశంలోనూ, విదేశాల్లోనూ ఎక్కడెక్కడకు వెళ్లేవారో, ఏమేం చేసేవారో కూడా ఐబీ తెలుసుకునేదట. అయితే బోస్ -కుటుంబ సభ్యులపై నెహ్రూ ఎందుకు నివేదిక అడుగుతున్నారో ఐబీ అధికారులకు కూడా తెలియదట. ప్రధానంగా నేతాజీ కుమారులపైన, మేనలళ్లు శిశిర్ కుమార్ బోస్, అమియానాథ్ బోస్ లకు సంబంధించిన విషయాలను ఐబీ ట్రాక్ చేసేదని ఆ ఫైళ్ల ద్వారా తెలుస్తోంది.. - See more at: http://telugu.expresstv.in/telugu/nehru-govt-snoop-on-netaji-family-90927.html#sthash.KdyyUA4N.dpuf

స్వతంత్ర పోరాటంలో పాల్గొని కొన్ని లక్షల మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేతాజీ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. భారతదేశ స్వతంత్రం కోసం ఎంతో పోరాడిని నేతాజీపై ఎన్ని సార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం వివరాలను వెల్లడించలేదు. చివరకు సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ప్రభుత్వం ససేమీరా అంది. అయితే తాజాగా వెలుగులోకి వస్తున్న అంశాలు నేతాజీ మరణంపై మరిన్ని అనుమానాలను పెంచుతున్నాయి. నేతాజీ పై నెహ్రూ ప్రభుత్వం అంతలా నిఘా ఉంచడానికి కారణాలు ఏంటి.. అంతకాలం నిఘా ఎందుకు ఉంచాల్సి వచ్చింది. అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం దీనిపై మరోలా స్సందిస్తున్నారు. కేవలం మీడియా ఇలాంటి కట్టు కథలను ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు. మరోపక్క బిజెపి నాయకులు మాత్రం కాంగ్రెస్ అంటేనే కుటిల బుద్ది అది నెహ్రూ దగ్గరి నుండి నేటి సోనియా గాంధీ వరకు అందరికి వంశపారంపర్యంగా వస్తోందని అంటున్నారు. మరి అసలు నెహ్రూ ఎందుకు నిఘా ఉ:చారు.. ఇన్నాళ్లు ఎంతో గోప్యంగా ఉన్న విషయాలు ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చాయి అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nehru  subhaschandrabose  netaji  spy  congress  modi  bjp  congressgovt  ib  report  

Other Articles