RSS | Hindu | India | Gharwapasi

Rss programmee gharwapasi in india to reresident to hindu religion

rss, gharwapasi, christian, muslim, hindu, india,

rss programmee gharwapasi in india to reresident to hindu religion. RSS the hindu organisation doing viral programmee but its creating problems and rising many questions.

హిందుత్వానికి ఆర్ఎస్ఎస్ మంచే చేస్తోందా..?

Posted: 04/10/2015 03:03 PM IST
Rss programmee gharwapasi in india to reresident to hindu religion

హిందువు... అంటే హిందుత్వాన్ని పాటించేవాడు అని అర్థం. అయితే హిందువు అన్న దానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి. అయితే హిందుత్వాన్ని తమ ఎజెండాగా చెప్పుకువచ్చే ఆర్ఎస్ఎస్ గత కొంత కాలంగా చేస్తున్న అతి హిందుత్వకు మంచే చేస్తోందా లేక లోలోపల తీరని నష్టాన్ని కలిగిస్తోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. హిందుత్వ పై ఆర్ఎస్ఎస్ వైఖరిపై వస్తున్న కొన్ని ప్రశ్నలు..

ఘర్ వాపసి _ అంటే ఎవరు,ఎవరింటికి రావాలి ?  ఘర్ వాపసి పేరుతో ఆర్ఎస్ఎస్ మత మార్పిడులకు పాల్పడుతోంది. అసలు ఎవరు ఎవరింటికి రావాలి ? వారి ఉద్దేశ్యం ప్రకారం ముస్లింలు,క్రైస్తవులంతా మతం మారి వారి స్వంత ఇల్లు అయిన హిందూ మతంలోనికి రావాలంటున్నారు.హిందూ మతంలోకి వచ్చే వారికి ఏ కులం ఇస్తారు ? అందరిని బ్రాహమణులుగా చేరుస్తారా ? అంటే కాదంటున్నారు.వారంతా నిమ్నకులాలలోనే ఉండాలి. కుల వ్యవస్థ నుండి బైటకి పోయిన వారిని తిరిగి కుల వ్యవస్థలోకి తీసుకు రావటమేనా ఘర్ వాపసి .

* క్రిస్టియన్ల పర్వదిన మైన డిసంబర్ 25న వాజ్ పాయ్ పుట్టిన రోజు సందర్బంగా సుపరిపాలన దినోత్సవాన్ని జరపాలని ఆదేశించారు.అంటే క్రిస్టమస్ ను మరచిపోవాలని చెప్పడమేనా వీరు చెప్పే లౌకికవాదం?.
* బి.జె.పి ఎంపి సాక్షి మహారాజ్ ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లలను కనాలని ,తద్వారా హిందూ జనాభాను పెంచాలని చెబుతున్నారు. ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టటమే కదా?
* సైన్స్ కన్నా వేదాలే గొప్పవని చెప్పడం ద్వారా , ఎన్ హెచ్ ఆర్ సి లోకి ఆర్ఎస్ఎస్ వారిని చేర్చడం ద్వారా,విద్యలోకి హిందూ మత భావాలను చొప్పించాలని చూస్తున్నారు. మోడీ ఎన్నికల్లో ఇంటర్నెట్ లను, ఫేస్ బుక్ లను ఉపయోగించిన వీరు వేదాలు,ఉపనిషత్తుల ద్వారా ఎందుకు ప్రచారం చెయ్యలేదు ?
*  ఆర్ఎస్ఎస్ వాదులైనందున నే వాజ్ పాయ్,మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్న లను ఇచ్చారు ?
*  పి.కె, ఓ మైగాడ్ చిత్రాలలో బాబాల మోసాలను బైట పెట్టారని ఆచిత్రాలపై దాడికి దిగ బడ్డారు ?
*  లౌకిక వాద రచయితలపై దాడి చేయడం ద్వారా తమ ఆదిపత్యన్ని కాపాడుకోవాలని చూడటం లేదా?

ఇలా అనేక ప్రశ్నలు వెల్లువలా పొంగుతున్నాయి. అయితే ఏ మత తరఫునైనా ప్రచారం చేసుకునే అవకాశాన్ని రాజ్యాంగం అందరికి కల్పిస్తోంది. కానీ కొందరు వ్యక్తులు లేదా కొన్ని సంస్థలు మాత్రం పరిధిని దాటి ప్రవర్తిస్తున్నాయి. ఇది మంచిది కాదు. అయితే దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి స్వేచ్ఛకు విలువ ఇచ్చినట్లే.. అతని మతానికి కూడా విలువ ఇవ్వాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rss  gharwapasi  christian  muslim  hindu  india  

Other Articles