Lakhwi | Pakistan | Mumbai | Attack

Lakhvi was released from adiala jail in rawalpindi

Lakhwi, pak, mumbai, jail, islamabad, india, rajnath, modi,

Lakhvi was released from Adiala Jail in Rawalpindi, a day after Lahore High Court (LHC) suspended his detention and ordered his immediate release. India had strongly reacted to the court's decision, saying it "eroded" the value of assurances repeatedly conveyed to it by Pakistan on cross-border terrorism.

ముంబై దాడి సూత్రధారి లఖ్వీని విడుదల చేసిన పాక్

Posted: 04/10/2015 04:05 PM IST
Lakhvi was released from adiala jail in rawalpindi

అనుకున్నంతా అయింది.. కరడుకట్టిన తీవ్రవాది లఖ్వీని పాక్ ప్రభుత్వం విడుదల చేసింది. ముంబాయి దాడి ద్వారా ఎంతో మంది ప్రాణాలు తీసిన లఖ్వీ విడుదల చెయ్యాలని పాక్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే గతంలోనూ లఖ్వీని విడుదల చెయ్యాలని ప్రయత్నాలు జరిగినా భారత ప్రభుత్వం హెచ్చరికలు, అంతర్జాతీయంగా వచ్చిన వత్తిడిల కారణంగా లఖ్వీ విడుదల నిలిచిపోయింది. అయితే ముందు నుండి లఖ్వీ విడుదలకు తహతహలాడుతున్న పాక్ ప్రభుత్వం కోర్టు నిర్ణయాన్ని పాటించింది.

 పాకిస్థాన్ జైలులో ఉన్న ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తాయిబా ఆపరేషన్స్ కమాండర్ లఖ్వీని విడుదల చేశారు. లఖ్వీపై నిర్బంధాన్ని రద్దు చేసి, తక్షణమే విడుదల చేయాలన్న లాహోర్ హైకోర్టు ఆదేశాల మేరకు పాక్ అతన్ని విడుదల చేసింది.  కాగా లఖ్వీని విడిచి పెట్టరాదని భారత్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా, పాక్ పట్టించుకోలేదు. 2008 నవంబర్లో భారత వాణిజ్య రాజధాని ముంబైపై దాడి కేసులో లఖ్వీ ప్రధాన సూత్రధారి అన్న విషయం తెలిసిందే. 2009 ఫిబ్రవరిలో లఖ్వీతోపాటు మరో ఆరుగురిని పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాడి జరిగిన సమయంలో తీవ్రవాద సంస్థ లష్కరే ఈ తోయిబాకు లఖ్వీ అపరేషనల్ హెడ్గా ఉన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముంబైలో 28/11 దాడిలో 166 మంది మరణించారు. 166 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న లఖ్వీలాంటి నేరస్థుడి విడుదలపై బారత్ తో పాటు సర్వత్రా నిరసన సెగలు వెల్లువెత్తాయి. మరి పాక్ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూను్కుంటుందో చూడాలి.

లఖ్వీ విడుదలపై భారత ప్రభుత్వం మండిపడింది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్ కోర్ట్ తీర్పుపై విచారం వ్యక్తం చేశారు. లఖ్వీలాంటి ఉగ్రవాదిని విడుదల చెయ్యకుండా ఉండాల్సిందని అబిప్రాయపడ్డారు. భారత్ పాకిస్థాన్ తో చర్చ లు జరపాలని ఆలోచించిందని కానీ పాక్ ప్రభుత్వం లఖ్వీని విడుదల చెయ్యడం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lakhwi  pak  mumbai  jail  islamabad  india  rajnath  modi  

Other Articles