Satyam | Scam | Final | Judgement

Court announce the final judgement on satyam scam

satyam, ramalngaraju, scam, court, cbi, probe, accuse, judgement.

court announce the final judgement on satyam scam. Satyam founder Ramalinga Raju has been found guilty by a Hyderabad court of criminal cheating and conspiracy in what is described as India's largest-ever corporate scandal.

ఏడేళ్ల జైలు శిక్ష.. భారీ జరిమానా.. సత్యం కేసులో శిక్ష ఖరారు

Posted: 04/09/2015 03:02 PM IST
Court announce the final judgement on satyam scam

సత్యం కుంభకోణంలో సిబిఐ కోర్టు తన తుది తీర్పును వెల్లడించింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సత్యం కుభకోణంలో దోషులకు కూడా కోర్ట్ శిక్ష ఖరారు చేసింది. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగ రాజుకు ఏడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, 5.50 కోట్ల జరిమానా విధించింది. రామరాజు, రామలింగ రాజులు మినహా మిగిలిన వారికి మాత్రం కేవలం 25 లక్షల జరిమానాను విధించింది కోర్ట్ . 2009 జనవరి 7న సత్యం కంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. 14 వేల కోట్ల కుంభకోణంలో మొత్తం 216 మంది సాక్షులను విచారించారు. 33 నెలల పాటు జైలులో ఉన్నాడు ప్రధాన నిందితుడు రామలింగ రాజు. సత్యం షేర్ వ్యాల్యూ ను కావాలని ఎక్కువ చేసి చూపించి, ఇన్వెస్టర్లను మోసం చేశారు రామలింగరాజు. దాదాపు 14వేల కోట్ల రూపాయల భారీ స్కాంలో సత్యం రామలింగరాజు ప్రధాన నిందితుడిగా కోర్ట్ పేర్కొంది.

రామలింగ రాజు,  రామరాజు లకు చెరో 5.5 కోట్ల జరిమానా విధిస్తు కోర్ట్ తీర్పునిచ్చింది. సత్యం కేసులో 120పి, 409, 406, 467, 471, 477, 201 సెక్షన్ ల కింద శిక్ష ను వేసింది. ఒక్కో సెక్షన్ లో 10 నుండి 15 లక్షలు కలిపి 5.5 కోట్ల భారీ జరిమానాను విధించింది. కేసులో సాక్షులను తారుమారు చెయ్యడాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే ఏడు సంవత్సరాల శిక్ష పడటంతో రామలింగరాజుకు బెయిల్ దొరికే అవకాశాలు లేవు. అయితే సిబిఐ కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 నుండి 2015 వరకు దాదాపు ఐదున్నర సంవత్సరాలు ఎన్నో మలుపులు తిరిగిన సత్యం కేసు చివరకు ఏడేళ్ల జైల్ శిక్ష తో పాటు భారీగా జరిమానా విధించింది.  అయితే రామలింగరాజు తన శిక్షను తగ్గించాలని కోరినా కోర్టు మాత్రం పట్టించుకోలేదు. మాజీ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్, పీడబ్ల్యూసీ ఆడిటర్లు గోపాలకృష్ణన్, టీ శ్రీనివాస్, జీ రామకృష్ణ, డీ వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలం,ఆడిటర్ వీఎస్ ప్రభాకర్ గుప్తా లకు కూడా తల 25 లక్షల రూపాయల జరిమానా విధించారు. సత్యం కేసులో లక్షా 60 వేల పేజీల భారీ ఛార్జిషీట్ దాఖలైంది

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satyam  ramalngaraju  scam  court  cbi  probe  accuse  judgement.  

Other Articles