Principal | Beat | Student | Death

Principal beats child to death for pencil theft

student, principal, beat, pencil, uttarpradesh, Dwarika Memorial School

Principal beats child to death for pencil theft. A second standard student died allegedly after being thrashed by the principal of his school in Uttar Pradesh's Barabanki district, about 40 kms from here, for “stealing” a pencil and eraser. The alleged incident occurred at Dwarika Memorial School at Railamau area.

పెన్సిల్ దొంగిలించాడని పిల్లాడిని కొట్టి చంపిన ప్రిన్సిపాల్

Posted: 04/09/2015 03:27 PM IST
Principal beats child to death for pencil theft

విద్యార్థులు మంచిగా చదువు కోవాలని టీచర్లు కాస్త గట్టిగా చెబుతుంటారు. ఇది అందరికి తెలిసిన విషయం. అయితే ఈ మధ్యన టీచర్లు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల మీద దాడులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన దారుణం మాత్రం అందరి గుండెలను పిండేసింది. విద్యార్థిపై పైశాచికత్వాన్ని ప్రదర్శించి అతని మృతికి కారణమయ్యాడో  హెడ్ మాస్టర్. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్దాపూర్ చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.  వివరాల్లోకి వెళితే.. రహిలామోవ్ గ్రామంలో ఉన్న చౌదరీ ద్వారిక ప్రసాద్ అకాడమీలో శివ రావత్ అనే విద్యార్ధి మూడో తరగతి చదువుతున్నాడు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్దాపూర్ లోని ద్వారకా ప్రసాద్ స్కూల్ లో ఓ విద్యార్థి పెన్సిల్, ఎరేజర్ కనిపించడం లేదని కంప్లైంట్ వచ్చింది. దాంతో రంగంలోకి దిగిన ప్రిన్సిపాల్ విద్యార్థుల బ్యాగులను చెక్ చేశారు. అయితే కొత్తగా చేరిన ఓ బాలుడి బ్యాగులో అవి దొరికాయి. అయితే ఆ విద్యార్థి తరగతిలో పెన్ దొంగిలించాడని హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకొచ్చారు.  దీంతో రెచ్చిపోయిన ఆ స్కూల్ హెడ్ మాస్టర్  లలిత్ కుమార్ వర్మ.. రావత్  ఉదర భాగంపై చితకబాదాడు. దీంతో  తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ఆ విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. కాగా, ఆ విద్యార్థి దారిలోనే చనిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లలిత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student  principal  beat  pencil  uttarpradesh  Dwarika Memorial School  

Other Articles