Smriti Irani case: Goa police summons Fabindia bosses, 9 other employees for questioning

Goa police summons fabindia bosses in smriti irani case

Smriti Irani, FabIndia, Ministry of Human Resource Development (MHRD), Micheal Lobo, Goa, CCTV cameras, Crimes against women, violence against women, popular clothing chain FabIndia., Smriti Irani hidden camera changing room, Fabindia store in Candolim, voyeurism case, Goa chief minister lakshmikanth parsikar

Goa Police summoned two top officials of Fabindia on Tuesday in connection with the voyeurism case filed against the outlet's staff after Union HRD Minister Smriti Irani alleged that the store had a CCTV camera focusing at the trial room.

ఫ్యాబ్ ఇండియా ఉన్నతాధికారులకు పోలీసుల సమన్లు..

Posted: 04/07/2015 10:09 AM IST
Goa police summons fabindia bosses in smriti irani case

కేంద్ర  మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ కనిపెట్టిన రహస్య కెమెరా కేసులో గోవా పోలీసులు ఫ్యాబ్  ఇండియా అత్యున్నత స్థాయి అధికారులకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 3న గుడ్ ఫ్రైడే రోజున సెలవుపై భర్తతో కలసి గోవాలోని కండోలిమ్ ప్రాంతంలో గల ఫ్యాబ్  ఇండియా షాపింగ్ మాల్ లోకి వెళ్లిన కేంద్ర మంత్రి స్మృతి ఇరాని.. రహస్య కెమెరాను కనిపెట్టి.. దానిపై పోలీసులకు పిర్యాదు చేసిన కేనును పార్టీ నేతలే కావాలని చల్లార్చారన్న విమర్శలపై గోవా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కేసు దర్యాప్తులో వేగాన్ని పెంచారు.

ఈ కేసుకు సంబంధించి ఫాబ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సుబ్రతా దత్తా, మేనేజింగ్ డైరెక్టర్ విలియమ్ బిసెల్లీలకు సమన్లు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి వారు అందుబాటులో వుండాలని పేర్కోంటూ పోలీసులు అతున్నత స్థాయి అధికారులకు సమన్లు జారీ చేశారు. కేంద్ర మంత్రితో పాటు ఈ చేనేత వస్త్రాలయంలో ఇలాంటి ఘటనలే ఎదుర్కోన పలువురు బాధితులను కూడా పోలీసులు పిలచి వారి వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు. అయితే ఈ కేసులో నిందితులుగా అరెస్టయిన నలుగురు ఉద్యోగులకు స్థానిక న్యాయస్థానం మరుసటి రోజున బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరితో పాటు మరో ఐదుగురు ఉధ్యోగులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు.

ఇదిలావుండగా, గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్.. ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యాలు చేశారు. ట్రయల్ రూంలో రహస్య కెమెరాల వ్యవహారంలో ఫ్యాబ్ ఇండియా సంస్థకు అనుకూలంగా మాట్లాడారు. ఇందులో ఆ సంస్థ తప్పేమీ లేదన్నారు. దేశంలోని ప్రఖ్యాత బొటిక్లలో ఫ్యాబ్ ఇండియా ఒకటని, ఉద్యోగి దుర్మార్గుడైనంత మాత్రాన సంస్థ మొత్తాన్ని నిందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 'సాక్షాత్తు కేంద్ర మంత్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు ప్రాధాన్యం లభించింది. ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గోవాలో మహిళలకు పూర్తి రక్షణ ఉంది. అని పర్సేకర్ అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  hidden camera  Goa  FabIndia store  lakshmikanth parsikar  

Other Articles