Mieko Nagaoka | Swimms | Japanese

A 100 year old japanese female swimmer finished a 1 500 metres in the masters swimming competition

Mieko Nagaoka, Swimms, Japanese, competetion, matsuyama, 100yearold

Mieko Nagaoka, a 100-year-old Japanese female swimmer, finished a 1,500 metres swim in one hour, 15 minutes and 54.39 seconds in the masters swimming competition in Matsuyama, a media report said

వందేళ్ల బామ్మ.. చేసి చూపింది సాహసం

Posted: 04/06/2015 11:39 AM IST
A 100 year old japanese female swimmer finished a 1 500 metres in the masters swimming competition

నిండు నూరేళ్ళు చల్లగా జీవించాలంటూ ఆశీర్వదిస్తుంటారు. కానీ అలా శత వసంతాలు బ్రతికే వాళ్ళ సంఖ్య ఈ భూమ్మీద చాలా తక్కువ. అలా ఎవరైనా వందేళ్లు బతకడమే ఓ పెద్ద గొప్ప. అదృష్టం కలిసొచ్చి అన్నేళ్లు బతికేసినవారు మహా అయితే ‘హరేరామ.. హరే కృష్ణ’ అనే ఓపిక కూడా లేక ఏదో ఒక మూలన పడి ఉండాల్సిందే. జపాన్ లో వందేళ్లు పూర్తి చేసుకున్న మైకో నగవొకా అనే మహిళ మాత్రం అందుకు భిన్నంగా చేసింది. యూత్ కూడా చేయలేని సాహసం చేసి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సెంచరీ ప్రాయంలో ఏకంగా  1,500 మీటర్లు ఈత కొట్టి రికార్డు సృష్టించింది.

ఈ వందేళ్ల సాహస బామ్మ మైకో నగవొక  1,500 మీటర్ల ఈత పోటీల మాస్టర్ మీట్ లో పాల్గొంది. గంటా పదిహేను నిమిషాల 54.39 సెకన్లలో ఈ దూరాన్ని ఆమె అధిగమించిందని గ్జిన్ హువా పత్రిక వార్త. 1914లో జన్మించిన నగవొకకు మొదట్లో ఈత ఎలా కొట్టాలో వచ్చేది కాదట. కానీ మొకాలికి అయిన గాయం నుంచి ఉపశమనం పొందేందుకు ఆమె 82 ఏళ్ల వయసులో ఈత కొలనులో ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందట. దీంతో ఆమె సొంతంగా ఈత నేర్చుకోవడమే కాకుండా ఈత ఈవెంట్ లో ఘనత సాధించి తమ దేశంలోనే అత్యంత పెద్ద వయసులో ఈ రికార్డు సాధించిన వ్యక్తిగా నిలిచింది. అంతకు ముందు మైకో తమ దేశానికి చెందిన సాంప్రదాయ డ్యాన్స్ చేసేది. అంతే కాకుండా డ్రామాల్లో కూడా నటించేది. అందుకే ఆమె ఫిట్ నెస్ పరంగా మెరుగ్గా ఉన్నదని చెబుతుంటారు. మొత్తానికి వందేళ్ల ప్రాయంలో బామ్మ స్విమ్మింగ్ లో అదరగొట్టేసింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mieko Nagaoka  Swimms  Japanese  competetion  matsuyama  100yearold  

Other Articles