Tobacco | Deaths | India | April

Tobacco deaths in india every death in only 32 sec

tobacco, deaths, modi, govt, warning, atlas, ciggars, india, company

In the first five days of April, an estimated 13,500 people died of tobacco-related diseases in India – roughly one death every 32 seconds. In the same period, the six biggest tobacco companies in the world made a profit of more than Rs 400,000 lakh – approximately Rs 87,000 per second.

పొగాకు ఉత్పత్తుల మరణ మృదంగం.. ప్రతి 32 సెకన్లకు ఒకరి మృతి

Posted: 04/06/2015 11:02 AM IST
Tobacco deaths in india every death in only 32 sec

పొగాకు ఉత్పత్తులు తీసుకుంటున్న వారు అంతకంతకు చావుకు దగ్గరవుతున్నారని అందరికి తెలుసు. అయితే పొగాకు ఉత్పత్తులను తీసుకుంటున్న వారి మరణాల సంఖ్యను చూస్తే మాత్రం అందరు విస్తుపోతున్నారు. ఎందుకంటే భయంకరమైన వ్యాధి సోకితే ఎలా ప్రజలు పిట్టల్లా రాలిపోతారో పొగాకు తీసుకుంటున్న వారు కూడా అలానే చని పోతున్నారు. ఇంతకీ ఎంతో తెలుసా ప్రతి 32 సెకన్లకు ఒకరు చావు ఒడిలో చేరుతున్నారు. అంటే దాదాపు ప్రతి అర నిమిషానికి ఒకరు చనిపోతున్నారని లెక్క. అలా ఏప్రిల్  నెల మొదటి ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా 12, 819 మంది చనిపోయారు. అయితే ప్రసపంచ వ్యాప్తంగా ఆరు పెద్ద పొగాకు ఉత్పత్తి కంపెనీలు పొందిన లాభం ఎంతో తెలుసా.. అక్షరాల నాలుగు లక్షల లక్షలు. అంటే సెకనుకు 87వేల రూపాయల లాభాలతో ఉన్నాయి.


పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల కలుగుతున్న మరణాలపై TobaccoAtlas.org చేసిన అధ్యయనంలో పొగాకు చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. పొగాకు ఉత్తత్తులను వాడితే ప్రమాదకరం..క్యాన్సర్ కు కారకం అని పెద్ద పెద్ద అక్షరాలతో వార్నింగ్ ఇచ్చినా వాటిని లెక్క చెయ్యకుండా పొగ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పొగాకు ఉత్తత్తి కంపెనీలు మాత్రం లాభాలే ధ్యేయంగా ఉత్తత్తులను తయారు చేస్తున్నాయి. అవి తాగిన వారు చనిపోతుంటే, కంపెనీలు మాత్రం లాభాలను గడిస్తున్నాయి. అలా పొగ తాగు వారు ప్రాణాలను కాల్చివేస్తు, కంపెనీలను లాభాల బాట పట్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సిగరెట్, బీడి లాంటి పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక సైజ్ ను పెంచాలని ఆలోచిస్తోంది. అయితే తాజా సర్వే మాత్రం ఖచ్చితంగా హెచ్చరిక సైజ్ ను పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఈ లెక్కలను బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటో తెలుసుకోవచ్చు. ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా పొగాకు ఉత్పత్తులపై కఠినంగా వ్యవహరిస్తుందేమో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tobacco  deaths  modi  govt  warning  atlas  ciggars  india  company  

Other Articles