Devendra Fadnavis calls ACB chief, gets corrupt Mantralaya official trapped

Cm devendra fadnavis trapped corrupt official mos patil

Fadnavis trapped corrupt official, maha cm fadnavis, maharastra chief minister devendra fadnavis, minister Ranjit patil, maha mantralaya erring official entrapped, MA Kadam, personal assistant, personal secretary, officer on special duty., zero tolerance towards corruption,

A day after a state law department official was arrested for allegedly accepting a bribe, MoS Ranjit Patil said he and Chief Minister Devendra Fadnavis had entrapped the erring official and arranged for the first instalment of the bribe.

అవీనీతి అధికారిని ఏసీబీకి పట్టించిన ‘ఒకే ఒక్కడు’..

Posted: 04/04/2015 05:52 PM IST
Cm devendra fadnavis trapped corrupt official mos patil

ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అందునా భారత దేశంలోని రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అధికార దర్పానికి దూరంగా.. సామాన్యుల కష్టాలను పరిష్కరిస్తూ.. వారిని ఇబ్బందుల పాలు చేసిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటున్నాడు. అరే ఏంటి.. ఒకే ఒక్కడు సినిమా కథను చెబుతున్నారు అనుకుంటున్నారా..? కన్నడ యాక్షన్ హీరో అర్జున్ నటించిన త్రిబాషా చిత్రం కదా అంటూ స్పీడై పోకండి.. ఎందుకంటే మీరు అనుకుంటున్నది సినిమా.. మేము చెబుతున్నది మాత్రం సినిమా కాదు. నిజంగా జరిగిన సన్నివేశమే.

భారత దేశ ఆర్థిక రాజధాని ముంబై కోలువైన రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నావిస్.. సినిమాలో అర్జున్ చేసినట్లుగానే తమ సెక్రటేరియట్ లోని అవినీతి ఐఎఎస్ అధికారిని ఏసీబీ అధికారులకు పట్టించారు. వివరాల్లోకి వెళ్తే తన సచివాలయంలో న్యాయ శా కార్యదర్శిగా పనిచేస్తున్న మిలిండ్ కదమ్.. ఆ శాఖ పరిధిలోని నోటరీ పోస్ట్ ఇవ్వడానికి ఓ నిరుద్యోగి వద్ద లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు నేరుగా ఫడ్నవీస్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఫడ్నవీస్, నేరుగా ఏసీబీ అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు తక్షణమే వలపన్ని పట్టేయాలని ఆదేశాలు జారీ చేశారు.
 
ఫడ్నవీస్ ఆదేశాలతో ఆగమేఘాలపై కార్యరంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, బాధితుడి ద్వారా మిలింద్‌కు రూ.4 లక్షలు ఇప్పించి, అవినీతి ఐఏఎస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనుమానితుడిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వినియోగించిన నాలుగు లక్షల రూపాయలను బాధితుడికి సమకూర్చింది కూడా ముఖ్యమంత్రి ఫెడ్నావిసే. మంత్రి పాటిల్ తో కలసి ఆయన నాలుగు లక్షల రూపాయలను సమకూర్చారట.

 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devendra Fadnavis  Maharashtra  Ranjit Patil  Mumbai  

Other Articles