Ruby Choudhary, accused of posing as IAS officer, 'arrested

Ruby choudhay gets herself clicked with president

ruby choudhay gets herself clicked with president, Ruby Chaudhary, Fake trainee IAS officer, Ruby Choudhary, fake IAS officer ruby choudary arrested, Mussoorie academy

Ruby Chaudhary, the woman who posed as a trainee IAS officer and illegally stayed at the academy in Mussoorie that trains the country's top civil servants, was arrested after she acknowledged her guilt during questioning, police said on Saturday

రాష్ట్రపతితో ఫోటోలు.. నకిలీ సర్టిఫికెట్లు.. ఐఎఎస్ ట్రైనీగా ఫోజు..

Posted: 04/04/2015 06:20 PM IST
Ruby choudhay gets herself clicked with president

దేశ ప్రథమ పౌరుడు, దేశాధ్యక్షుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను తోసిరాజీ, ఫోటో దిగి.. దాంతోనే తన టార్గెట్ చేరిన కిలాడీ లేడి.. తన భర్తను కూడా బూరిడీ కోట్టించింది. నిజానికి శిక్షణలో ఉన్న ఐఏఎస్లకు కూడా సాధ్యంకాని పనులన్నీ దర్జాగా, ఎలాంటి బెరుకూ లేకుండా కానిచ్చేసింది నకిలీ ఐఏఎస్ ట్రైనీ రూబీ చౌదరి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. గత ఏడాది ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి వెళ్లిన సందర్భంలో ఆయనతో కలిసి రూబీ దిగిన ఫొటో పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి.

సరిగ్గా వీరేందర్ మాలిక్ కూడా అదే నమ్మికతో రూబీ చౌదరిని పెళ్లిచేసుకున్నాడు. చివరికి ఆమె భర్త వీరేందర్ మాలిక్ కూడా అదే నమ్మి పెళ్లి చేసుకున్నాక అలసు విషయం తెలియడంతో.. అందరిలాగే అవాక్కయ్యాడు. 'రూబీ ఐఏఎస్ ట్రైనీ అని అబద్ధాలు చెప్పి తమ కుటుంబాన్ని నమ్మించారని. అందుకే ఆమెను పెళ్లాడానన్నారు. మోసం బయటపడ్డాక అన్ని విషయాలూ తనకు తెలుసని రూబీ చెప్పడం దారుణమన్నారు. ఇలాంటి వాళ్లని చట్టం కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో పూర్తిస్థాయి నిజానిజాలు వెలికితాయాలని పోలీసులను కోరారు.

శుక్రవారం రాత్రి రూబీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ముజఫర్నగర్ పోలీసు ఉన్నతాధికారులు శనివారం ప్రకటించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ముస్సోరీ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుమేరకు రూబీని అదుపులోకి తసుకుంటున్నట్లు తెలిపారు. అమె బస చేసిన గదిని క్షణ్నంగా తనిఖీ చేసిన పోలీసులు, ఆమె కుటుంబ సభ్యుల వాగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. అకాడమీలో ప్రవేశంకోసం డిప్యూటీ డైరెక్టర్ సౌరభ్ జైన్ కు రూ.5 లక్షలు లంచంగా ఇచ్కచినట్లు రూబీ పేర్కొనడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం వెలుగుచూడటంతో డిప్యూటీ డైరెక్టర్ జైన్ ను ఏ క్షణమైన తొలిగించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ruby Choudhary  fake trainee  Mussoorie IAS academy  

Other Articles