Congress | BJP | Advani | Respect

Congress suggest bjp to respect elders in party

congress, bjp, amith sha, adveni, banglore, rahul gandhi, congress leader,

congress suggest bjp to respect elders in party. amith sha suggest the congress party to search rahul gandhi. the congress counter on that and suggest the bjp party to respect elders in party like lk advani and muralimanohar joshi

ముందు అడ్వానీని గౌరవించండి: బిజెపికి కాంగ్రెస్ నేతల కౌంటర్

Posted: 04/04/2015 04:46 PM IST
Congress suggest bjp to respect elders in party

బిజెపి అగ్రనేత కాంగ్రెస్ నేతలకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. అదేంటి కాంగ్రెస్ కు బద్ద శత్రువైన అడ్వానీ కాంగ్రెస్ కు అవకాశం ఎలా ఇస్తారు అని అనుకుంటున్నారా.. అవకాశం అంటే ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా మాత్రం అవకాశం కల్పించారు. బెంగళూరులో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ కురువృద్ధుడు అడ్వానీ మౌనంగా ఉన్నారు. పార్టీ అధినేత అమిత్ షా మాట్లాడాలని ఎంతగా కోరినా అతను మాత్రం మాట్లాడలేదు. దాంతో దీన్నే కాంగ్రెస్ నాయకులు తమ ఆయుధంగా వాడుకుంటున్నారు. రాహుల్ గాంధీ గురించి వెతకమని సలహా ఇచ్చిన బిజెపికి కాంగ్రెస్ వాళ్లు తిరిగి వారికే సలహా ఇచ్చారు. ఇంతకీ ఆ సలహా ఏంటని అనుకుంటున్నారా..

రాహుల్ గాంధీ కనిపించడం లేదని ,ఆయనను వెతుక్కోండని వ్యాఖ్యానిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుగా తమ పార్టీ సీనియర్ నేతలు అద్వాని, మురళీమనోహర్ జోషిలను గౌరవించాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. దానికి తగినట్లుగానే అద్వాని తాజాగా అలక పూనారని వార్తలు వస్తున్నాయి. బెంగళూరులోని బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో అద్వాని మాట్లాడాలని బిజెపి అద్యక్షుడు అమిత్ షా కోరినా ఆయన మాట్లాడలేదని సమాచారం వస్తోంది.అయితే సమావేశాలలో వేదికపై ముందుగా అమిత్ షా జ్యోతి వెలిగించిన తర్వాత అద్వానిని ముందుకు పిలిచి జ్యోతి వెలిగించాలని కోరడం ,ఆయన ఆ పని పూర్తి చేయడం జరిగింది. కాని అద్వాని, మోడీల మధ్య పెద్దగా మాటల పలకరింపులు లేవని అంటున్నారు.80 ఏళ్లు దాటినవారు పార్లమెంటరీ బోర్డులో ఉండరాదని మోడీ గతంలో నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సీనియర్ లలో అసంతృప్తి ఉందని అంటున్నారు.మొత్తానికి అమిత్ షా కాంగ్రెస్ వారికి రాహుల్ ను వెతకమని సలహాను ఎలాగూ పాటించలేదు మరి కాంగ్రెస్ వారు అన్నట్లు అడ్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్లను గౌరవిస్తారా అన్నది ప్రశ్న.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  bjp  amith sha  adveni  banglore  rahul gandhi  congress leader  

Other Articles